ఓ సినిమా చేస్తే పేరొస్తుంది, మరో సినిమా చేస్తే గుర్తింపు వస్తుంది, ఇంకో సినిమా చేస్తే మంచి రెమ్యూనరేషన్ వస్తుంది… ఇలా ఒక్కో సినిమాకు ఒక్కోటి సంపాదించుకుంటూ ఉంటారు మన హీరోలు. అయితే ఇవన్నీ కలిపి ఓ సినిమాతో రావాలి అంటే అది రాజమౌళి సినిమా అయి ఉండాలి అంటారు. ఆ సినిమాకు వచ్చే క్రేజ్, ఫేమ్, వసూళ్లు.. ఇలా చాలావరకు హైలోనే ఉంటాయి. అలాంటి హైని ఇప్పుడు ఫీల్ అవుతున్నవాళ్లు రామ్‌చరణ్, తారక్. చరణ్‌కు సంబంధించి మరో గూస్‌బంప్స్ ఫీల్ ఒకటి బయటికొచ్చింది.
గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో చూస్తే ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. అందులో రామరాజు గెటప్‌లో విల్లు, బాణంతో చరణ్ పరిగెత్తుకొచ్చే పోస్టర్ కనిపిస్తోంది. అందులో ఏముంది ఎప్పటి నుండో ఆ పోస్టర్ ఉంది కదా అనొచ్చు. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న ఫొటో… ఓ నేపాల్ పేపర్‌లో పబ్లిష్ అయినది. ఏంటీ.. రామ్‌చరణ్ ఫొటో నేపాల్ పేపర్‌లో పబ్లిష్ అయ్యింద అనుకుంటున్నారా? అదే ఇక్కడ స్పెషల్. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదలై 40 రోజులు దాటిపోయినా ఇంకా ఆ సినిమా రికార్డులు, ఫీల్ కొనసాగుతూనే ఉంది.
దీన్ని కంటిన్యూ చేస్తూ నేపాల్ పేపర్ క్లిప్పింగ్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ‘కోసెలీ’ అనే నేపాలీ పేపర్‌లో రామ్‌చరణ్ గురించి ప్రత్యేక కథనం రాశారు అంటూ ఆ ఫొటోతో వైరల్‌గా చేస్తున్నారు. అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా గురించి రాశారు అని ఇంకొందరు అంటున్నారు. ఏది ఏదైనా ఇలా తెలుగు హీరో ఫొటో పక్క దేశంలో పేపర్‌లో రావడం పెద్ద విషయమే కదా. రాజమౌళి తెరకెక్కించిన చిత్ర రాజం ‘ఆర్‌ఆర్‌ఆర్’ మార్చి 25న ప్రేక్షకుల ముందుకొచ్చింది.
పాన్ ఇండియా లెవల్‌లో విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోయింది. అనతి కాలంలో రూ. వెయ్యి కోట్లకుపైగా వసూలు చేసి టాలీవుడ్ కాదు కాదు ఏకంగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు టీమ్ ఆ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యాన్స్ ఇలా ఫొటోలు వైరల్ చేసుకుంటూ ఆనందిస్తున్నారు.