Ram Charan: యాక్టింగ్‌ స్కూల్‌లో రామ్‌చరణ్‌… ఒకప్పుడు ఎలా ఉన్నాడో చూశారా?

ఇప్పటికి సినీ గోయర్స్‌కు పెద్దగా తెలియదు కానీ… ఒకప్పుడు రామ్‌చరణ్‌ను, ఇప్పటి చరణ్‌ను చూస్తే ఇద్దరూ ఒకటేనా అనే డౌట్‌ కచ్చితంగా వస్తుంది. సినిమా సినిమాకు మారుతూ, మెరుగవుతూ వస్తున్నాడు. అయితే చరణ్‌ ఎర్లీ డేస్‌కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. యాక్టింగ్‌ స్కూల్‌లో చరణ్‌ ఎర్లీ డేస్‌లో తీసిన వీడియో అది. అందులో యాక్టింగ్‌ ఏమీ లేదు. కానీ అప్పటి జులపాట జుట్టు, అమాయక ముఖం ఇప్పుడు వైరల్‌గా మారాయి.

తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న చరణ్‌… ఇటీవల ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో అదరగొట్టాడు. మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. ఇప్పుడు తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో కొత్త సినిమాలు ఎంపిక చేసుకుంటున్నారు. అయితే తాజాగా రామ్ చరణ్‌కు సంబంధించిన వైరల్‌ అవుతున్న వీడియో గురించి ఇప్పుడు చెబుతున్నాం.

చరణ్‌ సినిమాల్లోకి రావడానికి ముందుకు ముంబయిలోని ఓ యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో నటనలో మెళకువలు నేర్చుకున్నాడనే విషయం తెలిసిందే. ఇప్పుడు వైరల్‌ వీడియో అక్కడిదే. యాక్టింగ్‌ స్కూల్‌లో తొలి నాళ్లలో నేర్పించే ఓపెన్‌ అప్‌ ఎక్సర్‌సైజ్‌ను చరణ్‌ చేయడం ఆ వీడియోలో చూడొచ్చు. అదే సమయంలో వెనుక కూర్చున్న తన బ్యాచ్‌మేట్‌లు నవ్వడం కూడా ఆ వీడియోలో గమనించొచ్చు. అయితే ఆ వీడియో కింద రకరకాల కామెంట్లు కనిపిస్తున్నాయి.

ఏమీ రాని (Ram Charan) రామ్‌చరణ్‌… ఇప్పుడు ఇలా నటనలో తోపు అయ్యాడని, గ్లోబల్‌ స్టార్‌ అనే పేరు తెచ్చుకున్నాడని కొందరు అంటున్నారు. మరికొందరు అయితే రామ్‌చరణ్‌కు ఇది కూడా రాదా, ఆ వెనుకున్న వాళ్ల నవ్వులు చూద్దురు అంటూ దెప్పిపొడుస్తున్నారు. ఇక చరణ్‌ సినిమాల సంగతి చస్తే… శంకర్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ సెట్స్‌ మీద ఉంది. త్వరలో బుచ్చిబాబు సానా సినిమా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఏ సినిమాలు చేస్తాడు అనే క్లారిటీ లేదు. అయితే బాలీవుడ్‌లో ఓ భారీ సినిమా దాదాపు ఓకే అయ్యింది అనే టాక్‌ అయితే నడుస్తోంది.

https://twitter.com/NTRcult4ever/status/1740286040626098385

డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

బబుల్ గమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఖైదీ నెంబర్ 786’ టు ‘ఠాగూర్’.. తెలుగులో రీమేక్ అయిన విజయ్ కాంత్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus