టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ డైరెక్టర్లలో గౌతమ్ తిన్ననూరి ఒకరు. సుమంత్, ఆకాంక్ష సింగ్ జంటగా మళ్లీరావా సినిమాను తెరకెక్కించి తొలి ప్రయత్నంలోనే హిట్ ను సొంతం చేసుకున్న గౌతమ్ తిన్ననూరి నానితో జెర్సీ సినిమాను తెరకెక్కించి విజయం సాధించారు. ఈ సినిమాను హిందీలో షాహిద్ కపూర్ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించగా బాలీవుడ్ లో కూడా ఈ సినిమాకు పాజిటివ్ గా రివ్యూలు వచ్చాయి.
అయితే ఈ సినిమా కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. కేజీఎఫ్2 సినిమా సాధిస్తున్న కలెక్షన్లతో పోల్చి చూస్తే జెర్సీ సినిమా కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి. హిందీలో ఫుల్ రన్ లో జెర్సీ నష్టాలను మిగిల్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. హిందీ జెర్సీ రిజల్ట్ తో చరణ్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ ఇమేజ్ ఊహించని స్థాయిలో పెరిగింది.
శంకర్ సినిమాతో చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చేరుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే శంకర్ సినిమా తర్వాత గౌతమ్ ఎంపిక కరెక్టేనా? అనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతున్నాయి. అయితే చరణ్ మాత్రం సినిమా కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. చిరంజీవికి కూడా కథ నచ్చితే మాత్రమే చరణ్ డైరెక్టర్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే భారీ బడ్జెట్ సినిమాను గౌతమ్ హ్యాండిల్ చేయగలరా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ రెమ్యునరేషన్ భారీగా పెరిగిందని తెలుస్తోంది. ఆచార్య మినహా రామ్ చరణ్ తర్వాత సినిమాలు హిందీలో కూడా రిలీజ్ కానున్నాయని సమాచారం అందుతోంది. రామ్ చరణ్ గౌతమ్ కాంబో మూవీ కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది. రామ్ చరణ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో బాలీవుడ్ లో మార్కెట్ ను మరింత పెంచుకోవాలని భావిస్తున్నారని సమాచారం.