Ram Charan: తండ్రి దారిలోకి వస్తున్న రామ్‌ చరణ్‌.. అందుకే ఆ సినిమాల్లో అలా చేస్తున్నాడా?

చిరంజీవి (Chiranjeevi) .. టాలీవుడ్‌లో ప్రేక్షకుల పల్స్‌.. అందులోనూ మాస్‌ ప్రేక్షకుల నాడి పట్టేసిన నటుడు. అందుకే వారికి కేవలం యాక్షన్‌, ఎమోషన్‌ మాత్రమే కాదు.. అందులో కాస్త వినోదం కూడా ఉండాలి అనే కీలకాంశాన్ని తెలుసుకున్నాడు. అందుకే 150+ సినిమాలు చేసి ఇంకా కొనసాగుతున్నారు. ఆ మాటకొస్తే ఈ విషయం తెలిసిన నటులే ఇంకా కొనసాగుతున్నారు. ఇప్పుడు రామ్‌చరణ్‌ (Ram Charan) కూడా ఇదే పని చేయబోతున్నాడా? ఆయన మాటలు వింటుంటే అవుననే అనిపిస్తోంది.

Ram Charan

రామ్‌చరణ్‌ ఇటీవల ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైనప్పుడు.. తన సినిమాల గురించి కూడా ప్రస్తావన వచ్చింది. ఈ క్రమంలో తన తర్వాతి సినిమాలో వినోదం పాళ్లు కాస్త ఎక్కువగానే ఉంటాయి అని చెప్పేశారు. తర్వాతి సినిమా అంటే బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందనున్న చిత్రమే. ‘పెద్ది’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఆ సినిమాలో కామెడీ గత సినిమాలతో పోలిస్తే ఎక్కువగానే ఉంటుంది అని చరణ్‌ చెప్పేశాడు.

దీంతో ఈ తరహా పాత్రలో చరణ్‌ ఎలా ఉంటాడో అని ఓవైపు అభిమానులు అంచనాలు వేసేస్తున్నారు. విలేజ్‌ బేస్డ్‌ కామెడీ ఈ సినిమాలో ఉంటుంది అని చెప్పేయొచ్చు. ఇప్పటికే ‘రంగస్థలం’ సినిమాలో చరణ్‌ కాస్త వినోదం పండించినా అది కాస్తే. ఇప్పుడు బుచ్చిబాబు సినిమాలో ఇంకా ఎక్కువే ఉంటుంది అని చెబుతున్నారు. అంతేకాదు ఆ తర్వాత చేయబోయే సుకుమార్‌ సినిమాలో కూడా వినోదం పుష్కలంగానే వడ్డిస్తారట.

టాలీవుడ్‌లో చిరంజీవి కామెడీ టైమింగ్‌ను కొట్టే హీరోనే లేడు అని అంటుంటారు. మచ్చుకు కొన్ని చూస్తే.. ‘చంటబ్బాయి’, ‘దొంగ మొగుడు’, ‘రౌడీ అల్లుడు’, ‘అన్నయ్య’, ‘వాల్తేరు వీరయ్య’ లాంటి సినిమాలు కనిపిస్తాయి. ఇవే కాకుండా ఇంకా చాలానే ఉన్నాయి. అయితే చరణ్ నుండి ఈ తరహా సినిమా ఒకటి పడితే.. ఆ కామెడీ టైమింగ్‌కి కూడా వారసుడు అనిపించుకుంటాడు అని అభిమానులు ఆశిస్తున్నారు. చూడాలి మరి చరణ్‌ కామెడీ ఎలా ఉంటుందో?

చిరంజీవి సినిమాను రిజెక్ట్‌ చేసిందా? కృతి శెట్టి ఏం చెప్పిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus