రష్యా-ఉక్రెయిన్ ల మధ్య మొదలైన యుద్ధం గురించి అందరికీ తెలిసిందే.అక్కడి ప్రజలు ఎంతలా ఇబ్బందులు పడుతున్నారనే విషయం కూడా అందరికీ తెలిసిందే. దేశం మొత్తం రష్యా-ఉక్రెయిన్ ల మధ్య శాంతి ఒప్పందాలు కుదరాలని.. ప్రాణ నష్టం ఇక చాలని ప్రార్ధనలు చేస్తున్నారు.అయితే ఈ యుద్ధానికి రాంచరణ్ కు సంబంధం ఏంటి?అసలు అతని పేరు ఎందుకు తెరపైకి వచ్చింది అనే అనుమానాలు మీకు రావచ్చు. ఉక్రెయిన్ కు, చరణ్ కి సంబంధం లేదు.
అయితే రష్యా సైనికుల దాడి నుండీ తమ దేశాన్ని కాపాడుకుంటున్న ఒక ఉక్రెయిన్ పౌరుడితో చరణ్‌కు సంబంధం ఉంది. చరణ్- ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం షూటింగ్.. అక్కడ జరిగింది. ఆ టైములో రస్తీ అనే ఓ వ్యక్తి చరణ్ కు సెక్యూరిటీ గార్డ్‌గా వ్యవహరించారు. ఈ క్రమంలో రస్తీతో చరణ్ కు మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఇప్పుడు రష్యాతో ఉక్రెయిన్ కు జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్ష్యుడి పిలుపు మేరకు 80 ఏళ్ళ రస్తీ తండ్రి, రస్తీ కూడా మిలిటరీలో చేరి తమ దేశాన్ని రక్షించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
దీంతో అక్కడ రస్తీ కూడా ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నాడు.ఈ విషయం తెలుసుకున్న చరణ్ వెంటనే రస్తీని సంప్రదించి అతనికి తన వంతు సాయంగా కొంత డబ్బుని అందించారు.ఇక్కడ రస్తీ తన తండ్రికి వేరుగా అలాగే కుటుంబానికి ప్రత్యేకంగా చరణ్ సాయం అందించడం గమనార్హం. అంతేకాకుండా తనకి ఎటువంటి అవసరం వచ్చినా.. తెలియజేయడానికి ఆలోచించొద్దని తన వంతు ఆర్ధిక సాయం చేయడానికి ఏమాత్రం వెనుకాడనని చరణ్ తెలిపాడట. చరణ్ సాయం పై రస్తీ స్పందిస్తూ… ” నేను ఆయనకి కొంత కాలమే సెక్యూరిటీ గార్డ్ గా పనిచేసాను.
ఆ సమయంలో ఆయన నన్ను ఓ స్నేహితుడిలా ట్రీట్ చేసేవారు. ఆయన అవసరం అయిపోయాక కూడా కష్టకాలంలో ఉన్న నా కుటుంబాన్ని గుర్తుపెట్టుకుంటారని నేను అనుకోలేదు. అలాంటిది ఈ రోజు ఆయన నా కుటుంబానికి అండగా నిలబడడం ఆయన గొప్ప మనసుకి నిదర్శనం. ఆయనకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చారు రస్తీ.