రాజమౌళితో పని చేయడం గురించి రామ్‌చరణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

రాజమౌళి – ఎన్టీఆర్‌ – రామ్‌చరణ్‌.. ఈ ముగ్గురి గురించి, ఈ ముగ్గురూ సెట్స్‌లో ఎలా ఉంటారు అనే విషయం గురించి ఇప్పటికే చాలాసార్లు చదివి ఉంటారు. ‘ఆర్‌ఆర్ఆర్‌’ సినిమా ప్రచారంలో భాగంగా చరణ్‌ – తారక్‌ – జక్కన్న ఈ విషయాలు చెప్పారు. అయితే అప్పుడు బయటకు రాని ఓ విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. అదే ఓ షాట్‌ కట్‌ చెప్పాక.. రాజమౌళి నుండి రెస్పాన్స్‌ ఎలా ఉంటుంది అనేది. అంటే షాట్‌ ఓకేనా, లేక రీటేక్‌ చేద్దామా లాంటి విషయాలు రాజమౌళి ఎలా చెబుతారు అనేది రామ్‌చరణ్‌ వివరించాడు.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ఆస్కార్‌ ప్రచారం కోసం రామ్‌చరన్‌ ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. అక్కడ వివిధ టీవీ ఛానల్స్‌, ప్రముఖ యూట్యూబ్‌ ఛానల్స్‌, పాడ్‌కాస్ట్‌లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ రాజమౌళి @ సెట్స్‌ అనే విషయం గురించి చెప్పుకొచ్చాడు. షో హోస్ట్‌ రాజమౌళి ప్రస్తావన తెచ్చినప్పుడు ఆయన గురించి గొప్పగా పొగిడిన రామ్‌ చరణ్‌ ఆ తర్వాత సెట్స్‌లో ఉలా ఉంటారు… సినిమాను, టీమ్‌ను ఎలా హ్యాండిల్ చేస్తారు అనే విషయాలు చెప్పుకొచ్చాడు చరణ్‌.

రాజమౌళి ఒకసారి సెట్స్‌లో అడుగుపెట్టాక రాజమౌళి సహా టీమ్ మొత్తం సినిమా పైనే దృష్టి పెట్టాల్సిందేనట. ఏదైనా సీన్ ఒక్క టేక్‌లో అయితే చాలా మంది సూపర్, ఫెంటాస్టిక్ అని అంటారు. కానీ రాజమౌళి మాత్రం గుడ్, నైస్ అని అంటారట. అదే పదం తమకు అద్భుతంతో సమానం అని చెప్పుకొచ్చాడు చరణ్‌. సీన్స్‌, బడ్జెట్‌, షెడ్యూల్‌ విషయంలో రాజమౌళి చాలా పక్కాగా ఉంటారని చెప్పిన చరణ్‌.. ఏ రోజు ఎన్ని సీన్స్‌ చేయాలని కౌంట్‌ వేసుకుని పని చేస్తారని చెప్పాడు.

ఈ క్రమంలో షూటింగ్‌ స్పాట్‌లో సినిమా గురించి తప్ప, ఇంకే విషయాలు ఆలోచించరని, అయిపోయిన షాట్‌ గురించి మాట్లాడుకోవడం లాంటివి ఉండవని కూడా చెప్పాడు. పాత షాట్‌ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తే.. అయిపోయింది కదా నెక్స్ట్‌ షాట్‌కి రెడీ అవ్వాలి. మీరు వెళ్లి రెస్ట్‌ తీసుకోండి, షాట్‌ రెడీ అయ్యాక పిలుస్తాను అని తమకు చెప్పేవారని చరణ్‌ తెలిపాడు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus