మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహ రెడ్డి’ చిత్రం షూటింగ్ ఈమధ్యనే పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టుకుంది. మెగాస్టార్ కూడా తన పాత్రకు డబ్బింగ్ ఫినిష్ చేశారు. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో చారిత్రాత్మకంగా రూపొందింది ఈ చిత్రం. మెగా పవర్ స్టార్ రాంచరణ్ దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించాడు. అక్టోబర్ 2 న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. కానీ అనుకోని రీతిలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ లోని ‘కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ’ కార్యాలయం ముందు గొడవ కు దిగడం వైరలయ్యింది.
సినిమా షూటింగ్ కు ముందే నిర్మాత చరణ్ ‘సైరా’ కథ హక్కుల కోసం డబ్బులు చెల్లిస్తానని హామీ ఇచ్చారట. అయితే చరణ్ ను కలవకుండా మేనేజర్ బెదిరించాడని .. ఆఫీస్ లోకి వెళుతుంటే అడ్డుకుంటున్నాడని మీడియా ముఖంగా వారు ఆరోపించడం జరిగింది. అయితే మొదట లక్షల్లో డబ్బు చెల్లించేందుకు చరణ్, ‘కొణిదెల ప్రొడక్షన్స్ టీమ్’ ఓకే చెప్పారట.
కానీ సైరా కుటుంబం వారు ఏకంగా 8కోట్లు డిమాండ్ చేస్తున్నారని.. అందుకే అంత చెల్లించలేమని వారు చెప్తున్నట్టు తెలుస్తుంది. కథ ప్రకారం ఉయ్యాల వాడ సొంత ఇంటిని.. ఆ విలేజీని `సైరా` టీమ్ ఉపయోగించుకున్నారు. అక్కడ షూటింగ్ చేస్తున్న సమయంలో వస్తువులతో పాటు పంట కూడా నాశనమయ్యిందని వారు చెప్పుకొస్తున్నారు. దీనికి 8 కోట్లు చరణ్ చెల్లించాలని వారు డిమాండ్ చేస్తుండడం గమనార్హం. చూస్తుంటే వివాదం సర్దిమణిగేలా కనిపించడం లేదు. ముందు.. ముందు ఈ ‘సైరా’ టీం కు ఇంకెన్ని వివాదాలు ఎదురవుతాయో.