Ram Charan, Suriya: లోకేష్ కనగరాజన్ డైరెక్షన్లో సూర్య మూవీ ఫిక్సట..!
- August 28, 2021 / 09:22 AM ISTByFilmy Focus
‘ఖైదీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఇష్టమైన డైరెక్టర్ గా మారిపోయాడు దర్శకుడు లోకేష్ కనగరాజన్. అంతకు ముందు అతను సందీప్ కిషన్ తో ‘నగరం’ అనే చిత్రాన్ని తెరకెక్కించినప్పటికీ.. ‘ఖైదీ’ తోనే అతను ఆడియెన్స్ అటెన్షన్ ను డ్రా చేసాడు. అటు తర్వాత ‘నగరం’ మూవీని కూడా బాగానే చూసారు లెండి. అయితే ‘ఖైదీ’ తర్వాత ఇతను విజయ్ తో ‘మాస్టర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు అనే విషయం తెలుసుకున్నాక.. ఆ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
విజయ్ సేతుపతిని విలన్ గా కూడా ఎంపిక చేసుకోవడంతో ‘మాస్టర్’ పై అప్పటి వరకు ఉన్న అంచనాలు తారాస్థాయికి వెళ్లాయనే చెప్పాలి. దాంతో రాంచరణ్, రవితేజ వంటి టాలీవుడ్ స్టార్లు కూడా లోకేష్ తో సినిమా చేయాలని ఇంట్రెస్ట్ చూపించారు. ఈ దశలో రాంచరణ్ కు ఓ కథ కూడా వినిపించాడు లోకేష్. అది చరణ్ కు నచ్చింది కూడా..! కానీ ‘మాస్టర్’ టాక్ చూసాకో ఏమో చరణ్ మనసు మార్చుకున్నాడు. లోకేష్ తో సినిమా చేసే ఆలోచనని కూడా అతను విరమించుకున్నాడు.

అయితే అదే కథని సూర్యకి చెప్పి ఓకే చేయించుకున్నాడట లోకేష్. సూర్య ఈ ప్రాజెక్టు చేయడానికి చాల ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. ‘రైన్ ఆన్ ఫిలిమ్స్’ వారు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు తాజా సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.
Most Recommended Video
చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

















