ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొన్ని వారాల క్రితం బాలీవుడ్ సినిమా నటీనటులను, దర్శకనిర్మాతలను ప్రత్యేకంగా ఢిల్లీ పిలిపించుకొని వాళ్లందరికీ స్పెషల్ విందు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ లో రకుల్ ప్రీత్ సింగ్, దిల్ రాజు తప్ప తెలుగు ఇండస్ట్రీని రీప్రెజంట్ చేసిన పెద్ద హీరోలు, దర్శకులు ఎవరూ లేరనే చెప్పాలి. ఈ విషయమై ఉపాసన డైరెక్ట్ గా మోడీకి ఒక ట్వీట్ వేసింది. ఫిలిమ్ ఫ్రేటర్నిటీ అంటే కేవలం బాలీవుడ్ మాత్రమే కాదని.. సౌత్ ఇండస్ట్రీ కూడా అని. అంత పెద్ద ఈవెంట్ లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలకు చెందిన నటీనటులు, దర్శకనిర్మాతలు ఎవరూ లేకపోవడం బాధాకరం అని ఆమె పేర్కొంది.
అయితే.. ఇటీవల మోడీకి ఉపాసన ట్వీట్ గురించి రామ్ చరణ్ ను ప్రశ్నించగా.. చరణ్ చాలా సింపుల్ గా “అరే నాకు ఈ విషయం తేలియదే” అని చెప్పడం గమనార్హం. నిజానికి రామ్ చరణ్ సోషల్ మీడియాలో చాలా ఇనాక్టివ్. ఏదో ఒక ఫేక్ ప్రొఫైల్ తో ఫేస్ బుక్ లో ఉన్నాడు కానీ.. చరణ్ సోషల్ మీడియా యాక్టివిటీ చాలా వీక్ అనే చెప్పాలి. దాంతో చరణ్ ఈ విధంగా స్పందించడం పెద్ద విశేషం ఏమీ కాదు.