పోటీ ప్రపంచంలో హీరోగా నిలదొక్కుకోవడమే కష్టం. మంచి కథని ఎంచుకోవడం, అందుకుతగ్గట్టు కష్టపడడం.. ఒత్తిడి కనిపించడం కనిపించడం.. వంటివి తేలికైన విషయం కాదు. పైగా తండ్రి మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా. తనపై పెట్టుకున్న అంచనాలకు రీచ్ కావాల్సి ఉంటుంది. కోట్లాది అభిమానులను మెప్పించాల్సి ఉంటుంది. వీటన్నిటిని రామ్ చరణ్ అధిగమించారు. తండ్రికి తగ్గ కొడుకుగా నిరూపించుకున్నారు. రీసెంట్ గా రంగస్థలం సినిమాతో అనేక రికార్డులు బద్దలు కొట్టారు. ఇలా హీరోగా కష్టపడుతూనే నిర్మాతగా విజయం సాధించారు. ఖైదీ నంబర్ 150 సినిమాతో హిట్ కొట్టారు. ఇప్పుడు నిర్మాతగా సైరా నరసింహా రెడ్డి సినిమాని చేస్తున్నారు. హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో యాక్షన్ మూవీ చేస్తున్నారు.
ఇవే కాకుండా అనేక వ్యాపారంలో భాగస్వామిగా ఉన్నారు. తాజాగా కొత్త బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో స్టూడియోల నిర్మాణాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానం పలికారు. అందుకోసమే సినీ రంగంలో అనుభవం ఉన్నవారికి ప్రభుత్వం వైజాక్ లోభూములను కేటాయించాలని భావిస్తోంది. ఏవీఎం స్టూడియో వారికి, బాలకృష్ణ కూడా స్టూడియో నిర్మాణాలకు భూములు ఇవ్వనున్నట్లు తెలిసింది. అదేవిధంగా సాగరతీరాన రామ్ చరణ్ ఓ స్టూడియో నిర్మించాలని ఫిక్స్ అయినట్టు తెలిసింది. అందుకు మంచి ప్రాంతాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. అంత సెట్ కాగానే ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించనున్నారు.