‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాకు సంబంధించి ఇప్పటివరకు పాటలు, టీజర్ బయటకు వచ్చాయి. వాటి ప్రకారం చూస్తే సినిమాలో రామ్ చరణ్ (Ram Charan) రెండు పాత్రల్లో.. మూడు లుక్స్‌లో కనిపించనున్నాడు. దానికి సంబంధించి పోస్టర్లకు మంచి స్పందన కూడా వస్తోంది. అయితే ఇవి కాకుండా మరో సర్‌ప్రైజ్ లుక్ కూడా ఉందట. అది సినిమాలో కీలక సమయంలో బయట పెడతారు అని అంటున్నారు. దీనికి సంబంధించి నిర్మాత దిల్ రాజు (Dil Raju) చిన్న లీక్ కూడా ఇచ్చారు.
Game Changer
మామూలుగా మెగా ఫ్యామిలీ సినిమాలకు లీక్‌లు అంటే అది చిరంజీవే చేస్తుంటారు. ఆయన ప్రీరిలీజ్ ఈవెంట్‌కి వస్తే ఓ లీక్ ఇచ్చి పండగ చేసుకోమంటుంటారు. అయితే ఈసారి ఆ ఛాన్స్ నిర్మాత దిల్ రాజు తీసుకున్నారు. రామ్‌చరణ్ 256 అడుగుల కటౌట్ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా విజయవాడలో దిల్ రాజు మాట్లాడుతూ సినిమా గురించి, అందులో రామ్ చరణ్ పాత్రల గురించి మాట్లాడుతూ ఈ విషయం లీక్ చేశారు.
రామ్ చరణ్ ఈ సినిమాలో స్టూడెంట్‌గా, ఐఏఎస్ ఆఫీసర్‌గా, రైతు నాయకుడు – రాజకీయ నాయకుడు అప్పన్న పాత్రలో కనిపిస్తాడు అని ఇప్పటికే టీజర్ చూస్తే అర్థమవుతుంది. అయితే వీటితో పాటు చరణ్ పోలీస్ ఆఫీసర్‌గా కూడా కాసేపు కనిపిస్తాడని చిన్నగా లీకిచ్చారు దిల్ రాజు. అంటే ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) సినిమా తర్వాత మరోసారి పోలీసుగా తన నట విశ్వరూపాన్ని చూపించనున్నాడు అని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ సినిమా టీజర్‌ను వీలైనంత త్వరగా విడుదల చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. ఒకటో తేదీనే ట్రైలర్ వచ్చేస్తుంది అని చెబుతున్నారు. మరోవైపు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ముఖ్య అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా ప్లాన్ చేస్తున్నారు. ఆయన సమయం ఇచ్చే దాన్ని బట్టి ప్రీరిలీజ్ ఏర్పాట్లు చేస్తామని దిల్ రాజు చెప్పారు. అది కూడా ఈ వారంలోనే ఉంటుంది అని అంటున్నారు. త్వరలోనే ఈ అప్‌డేట్ చెబుతారని టాక్.