సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో కొంతమంది హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడటం సాధారణంగా జరుగుతుంది. చిరంజీవి బాలయ్య, బాలయ్య రవితేజ, ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ సినిమాలు ఒకే సమయంలో బాక్సాఫీస్ వద్ద పోటీ పడిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. అదే విధంగా బాక్సాఫీస్ వద్ద మహేష్, చరణ్ సినిమాలు ఏకంగా నాలుగు సార్లు పోటీ పడగా మెజారిటీ సందర్భాల్లో సక్సెస్ చరణ్ కు దక్కింది. చరణ్ మహేష్ బాక్సాఫీస్ పోటీ 2013 లో మొదలైంది.
నాయక్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలు ఒకే సమయంలో విడుదల కాగా రెండు సినిమాలు సక్సెస్ సాధించినా కమర్షియల్ లెక్కల ప్రకారం నాయక్ ఒక మెట్టు పైచేయి సాధించింది. 2014లో ఎవడు, 1 నేనొక్కడినే సినిమాలు రిలీజ్ కాగా ఈ రెండు సినిమాలలో ఎవడు బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అదే సంవత్సరం ఆగడు, గోవిందుడు అందరివాడేలే సినిమాలు రిలీజ్ కాగా గోవిందుడు అందరివాడేలే బెటర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది.
2018 సంవత్సరంలో రంగస్థలం, భరత్ అనే నేను సినిమాలు కొన్ని వారాల గ్యాప్ లో విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించి మంచి లాభాలను అందించాయి. చరణ్, మహేష్ పోటీలో మెజారిటీ సందర్భాల్లో చరణ్ కు అనుకూలంగా రిజల్ట్ వచ్చింది. చరణ్, మహేష్ కాంబోలో మల్టీస్టారర్ అంటూ గతంలో ప్రచారం జరిగినా ఈ కాంబోలో ఇప్పటివరకు సినిమా రాలేదు. రాబోయే రోజుల్లో ఈ కాంబో దిశగా అడుగులు పడతాయేమో చూడాలి.
చరణ్ ఇప్పటికే గ్లోబల్ ఇమేజ్ సంపాదించుకోగా రాజమౌళి సినిమాతో మహేష్ ఇమేజ్ పది రెట్లు పెరుగుతుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. హాలీవుడ్ లెవెల్ లో మహేష్ జక్కన్న కాంబో మూవీ తెరకెక్కుతోంది. (Ram Charan) చరణ్, మహేష్ ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.