రాంచరణ్ పర్సనల్ లైఫ్ గురించి కూడా చాలా మందికి తెలిసిందే. అతని డైట్ మరియు సోషల్ మీడియా ప్రమోషన్లు మరియు బిజినెస్ వ్యవహారాలను అతని సతీమణి ఉపాసన చక్కబెడుతుంటుంది. అపోలో హాస్పిటల్స్ కో – ఫౌండర్ మరియు చైర్మెన్ అయిన ప్రతాప్ సి రెడ్డి మనవరాలు ఉపాసన అన్న సంగతి తెలిసిందే. సామాజిక బాధ్యతల్ని చేపట్టడంలో కూడా ఈమె ముందు ఉంటుంది.ఈ విషయాలను పక్కన పెట్టేస్తే ఉపాసన చెల్లెలు అయిన అనుష్పాల నిశ్చితార్థం ఇటీవల ఘనంగా జరిగింది.
కార్ రేసర్ అర్మన్ ఇబ్రహీం ను అనుష్పాల పెళ్లాడనుందట.కొంతకాలంగా వీరు ప్రేమలో ఉన్నట్టు తెలుస్తుంది. వీరి పెళ్ళికి పెద్దలు కూడా అంగీకరించడంతో పెళ్ళికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా అర్మన్, అనుష్పాల నిశ్చితార్ధ వేడుకని కూడా వారు నిర్వహించినట్టు స్పష్టమవుతుంది. అర్మాన్ తో అనుష్పాల సన్నిహితంగా ఉన్న ఫోటోలను ఆమె అక్క ఉపాసన తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.అంతేకాదు ‘నా డార్లింగ్స్‌కు అభినందనలు’ అంటూ ఉపాసన తన సోషల్ మీడియాలో పేర్కొంది.
ఈ పోస్ట్ కు ఉపాసన ఫాలోవర్స్ తో పాటు కాజల్, తమన్నా వంటి స్టార్ హీరోయిన్లు కూడా స్పందించి ఉపాసన సోదరికి కంగ్రాట్యులేషన్స్ తెలిపారు. ‘ఉపాసన ఎలా కులాంతర వివాహం చేసుకుందో.. అదే విధంగా ఆమె చెల్లెలు కూడా కులాంతర వివాహం చేసుకుంటుంది’ అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతుండడం విశేషం. సరే.. ఈ కొత్తజంట ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :