Upasana: అన్ని వృద్ధాశ్రమాలకు ఉపాసన సాయం చేశారా?

కొన్నేళ్ల క్రితం వరకు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెద్దగా పరిచయం లేకపోయినా చరణ్ తో వివాహం తర్వాత ఉపాసన వార్తల్లో నిలిచారు. ఈ మధ్య కాలంలో పలు సేవా కార్యక్రమాల ద్వారా ఉపాసన పేరు మారుమ్రోగుతోంది. అపోలో హాస్పిటల్ పనులతో ఉపాసన బిజీగా ఉన్నా పేద ప్రజలను ఆదుకునే విషయంలో మాత్రం ఉపాసన ముందువరసలో ఉన్నారు. మెగా కోడలిగా ఉపాసన పేరుప్రఖ్యాతులను మరింత పెంచుతున్నారు. అయితే ఉపాసన 150 వృద్ధాశ్రమాలకు సహాయం చేస్తున్నారని ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

ఉపాసన కొంతమంది వృద్ధులతో కలిసి ఫోటోలు దిగగా ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మెగా కోడలి మంచి మనస్సుకు అభిమానులు సైతం తెగ సంతోషిస్తున్నారు. ఉపాసన బిలియన్ హార్ట్స్ ఫౌండేషన్ తో కలిసి వృద్ధాశ్రమాలకు తన వంతు సహాయం చేస్తున్నారని సమాచారం అందుతోంది. కరోనా కేసులు పెరిగిన సమయంలో కూడా ఉపాసన బెడ్ దొరకని ఎంతోమందికి సహాయం చేసి వార్తల్లో నిలిచారు. రామ్ చరణ్ సినిమాలను విడుదలైన రోజే చూసే ఉపాసన సోషల్ మీడియా ద్వారా సినిమాలకు సంబంధించి తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారనే సంగతి తెలిసిందే.

ఆచార్య సినిమా గురించి కూడా ఉపాసన లవ్ ది మూవీ అంటూ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. చరణ్ కెరీర్ విషయంలో సక్సెస్ కావడానికి ఉపాసన తన వంతు సహాయసహకారాలను అందిస్తున్నారు. చరణ్ ప్రస్తుతం శంకర్ మూవీతో బిజీగా ఉన్నారు. 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. మే నెల రెండో వారం నుంచి ఈ సినిమా షూట్ లో చరణ్ పాల్గొననున్నారు. చరణ్ కు జోడీయా కియారా అద్వానీ ఈ సినిమాలో నటిస్తున్నారు.

శంకర్ కు సైతం ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కావడం ఎంతో ముఖ్యమని తెలిసిందే. 2023 సంక్రాంతి కానుకగా ఈ భారీ బడ్జెట్ మూవీ రిలీజ్ కానుంది.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus