Upasana: టెస్ట్ చేయించుకోకపోతే తెలిసేది కాదు.. ఉపాసన పోస్ట్!’

కరోనా ఇంకా పూర్తిగా అంతం కాలేదు. మన చుట్టూ ఇంకా తిరుగుతుందనే చేదు నిజాన్ని యంగ్ హీరో రామ్ చరణ్ భార్య, ప్రముఖ వ్యాపారవేత్త ఉపాసన కొణిదెల బయటపెట్టారు. తానే మహమ్మారి బారిన పడినట్లు ఆమె తెలిపింది. ప్రస్తుతం కరోనా నుంచి కోలుకుంటున్నట్లు ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. సామాజిక అంశాలపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా చెబుతుంటుంది ఉపాసన. ముఖ్యంగా కరోనా ఫస్ట్ వేవ్ లో కరోనా బారిన పడకుండా ముండస్టులు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి..?

ఒకవేళ కరోనా బారిన పడితే ఎలాంటి మందులు వాడాలో ఉపాసన వీడియోల రూపంలో వెల్లడించింది. కరోనా ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్ సమయంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. థర్డ్ వేవ్ లో పెద్దగా ప్రాణాపాయం జరగలేదు. కరోనా పూర్తిగా మాయమైందని భావిస్తున్న తరుణంలో ఉపాసన షాకింగ్ న్యూస్ చెప్పింది. ఈరోజు ఆమె రాసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరోనా బారిన పడిన విషయం ఎలా బయటపడిందో ఆమె చెప్పుకొచ్చారు.

‘గ‌త వారం నేను కోవిడ్‌బారిన ప‌డ్డాను. వ్యాక్సినేష‌న్ తీసుకోవ‌డం వ‌ల్ల స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు మాత్ర‌మే క‌నిపించాయి. కేవ‌లం పారా సిటిమాల్‌, విట‌మిన్ మందులు మాత్ర‌మే వైద్యులు వాడ‌మ‌ని స‌ల‌హా ఇచ్చారు. ప్ర‌స్తుతం కోవిడ్ నుంచి కోలుకున్నా. మ‌ళ్లీ జీవితాన్ని అన్ని విధాలుగా ప్రారంభించేందుకు సిద్ధ‌మ‌య్యాను. మాన‌సికంగా, శారీర‌కంగా ధైర్యంగా వున్నాను.

కోవిడ్ మ‌ళ్లీ పంజా విసురుతుందా? అంటే చెప్ప‌లేని ప‌రిస్థితి. మ‌న జాగ్ర‌త్త‌ల్లో మ‌నం వుండ‌డం, సంతోషంగా జీవించ‌డం ఎంతో ముఖ్యం. చెన్నైలో వున్న మా తాత‌య్య ద‌గ్గ‌రికి వెళ్లాల‌నుకుని ప‌రీక్ష‌లు చేయించుకుంటే పాజిటివ్‌గా తేలింది. ఒక‌వేళ టెస్టులు చేయించుకోక‌పోతే ఎవ‌రికీ తెలిసేది కాదు’ అంటూ రాసుకొచ్చింది.

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus