Skanda: యూట్యూబ్ ను షేక్ చేస్తున్న రామ్.. అక్కడ మాత్రం హిట్టైందిగా!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ (Ram)  గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రామ్ కెరీర్ పరంగా బిజీగా ఉండగా రామ్ సినిమాలు వ్యూస్ పరంగా సంచలనాలు సృష్టిస్తున్నాయి. రామ్ గత సినిమా స్కంద బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే స్కంద (Skanda) హిందీ వెర్షన్ యూట్యూబ్ లో పది కోట్ల వ్యూస్ తో సంచలనం సృష్టించడం గమనార్హం.

రామ్ సినిమాలు యూట్యూబ్ లో సంచలనాలు సృష్టించడం ఇదే తొలిసారి కాదు. రామ్ నటించిన సినిమాలలో స్కంద కాకుండా మరో 8 సినిమాల హిందీ వెర్షన్లు సైతం పది కోట్ల వ్యూస్ ను సొంతం చేసుకున్నాయి. రామ్ ఒక విధంగా తన సినిమాలతో యూట్యూబ్ ను షేక్ చేస్తున్నారని చెప్పవచ్చు. థియేటర్లలో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోని స్కంద హిందీ యూట్యూబ్ ప్రేక్షకులను మాత్రం అంచనాలను మించి మెప్పించింది.

జూన్ నెల 17వ తేదీన స్కంద హిందీ డబ్బింగ్ యూట్యూబ్ లో రిలీజ్ కాగా యూట్యూబ్ లో విడుదలైన నెలన్నర రోజుల్లోనే ఈ స్థాయిలో సంచలనాలు సృష్టించడం సాధారణ విషయం కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టాలీవుడ్ హీరోలు హిందీ డబ్బింగ్ వెర్షన్లతో సైతం సంచలనాలు సృష్టిస్తున్నారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.

రామ్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ కు తగ్గ విజయాలు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా డబుల్ ఇస్మార్ట్ తో (Double Ismart)  ఆ లోటు తీరుతుందేమో చూడాలి. దాదాపుగా 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన డబుల్ ఇస్మార్ట్ మూవీ బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో చూడాల్సి ఉంది. రామ్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. రామ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus