కొన్ని సినిమాలు ఏంటో థియేటర్లలో సరిగ్గా ఆడవు. అలాంటి వాటికి ఓటీటీలో పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అని కూడా ఊహించలేము. కానీ కొన్ని సినిమాలు ఓటీటీలో ప్రేక్షకులను అలరించిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఆ లిస్ట్ లో గోపీచంద్ నటించిన ‘రామబాణం’ సినిమా కూడా చేరింది. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ పై టి.విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహా నిర్మాతగా వ్యవహరించారు. గోపీచంద్ తో ‘లక్ష్యం’ ‘లౌక్యం’ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన శ్రీవాస్..
ఈ చిత్రానికి దర్శకుడు. హ్యాట్రిక్ కాంబినేషన్ కావడం వల్ల.. ఈ సినిమా పై (Ramabanam) భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నిర్మాతలు కాంబినేషన్ పై ఉన్న నమ్మకంతో రూ.55 కోట్ల వరకు బడ్జెట్ పెట్టేశారు. అంటే గోపీచంద్ మార్కెట్ కి మించి ఖర్చు చేసినట్టే. ఇక ఏప్రిల్ 5 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే ఈ మూవీ డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది. పాత చింతకాయ పచ్చడి లాంటి కథ అని.. కామెడీ విసిగించిందని.. ఎమోషనల్ సన్నివేశాలు భరించలేకపోయామని ప్రేక్షకులు పెదవి విరిచారు.
మ్యాట్నీలకే జనాలు లేక థియేటర్లు విలవిలలాడాయి. దాదాపు 4 నెలల పాటు ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కాలేదు. బహుశా డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసుకున్న వారు కూడా వెనకడుగేసే పరిస్థితి వచ్చింది. అయితే రెండు రోజుల క్రితం నెట్ ఫ్లిక్స్ లో డిజిటల్ రిలీజ్ అయిన ఈ సినిమా ఇక్కడ పాజిటివ్ రెస్పాన్స్ ను రాబట్టుకుంది. అంతేకాదు ఈ వీక్ నెట్ ఫ్లిక్స్ టాప్ 10 మూవీస్ లో ఇది నెంబర్ 1 గా నిలిచింది.
మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!