Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Varanasi జక్కన్న మాస్టర్ ప్లాన్ ఇదే!
  • #రాజాసాబ్ కి అన్యాయం జరుగుతుందా?
  • #థియేటర్లలో దోపిడీ.. రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి!

Filmy Focus » Movie News » ‘రామారావు ఆన్ డ్యూటీ’ గురించి దర్శకుడు శరత్ మండవ చెప్పిన ఆసక్తికర విషయాలు..!

‘రామారావు ఆన్ డ్యూటీ’ గురించి దర్శకుడు శరత్ మండవ చెప్పిన ఆసక్తికర విషయాలు..!

  • July 27, 2022 / 12:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘రామారావు ఆన్ డ్యూటీ’ గురించి దర్శకుడు శరత్ మండవ చెప్పిన ఆసక్తికర విషయాలు..!

రవితేజ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ.. ‘రామారావు ఆన్ డ్యూటీ’. ‘శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, రవితేజ టీం వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో టీం అంతా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటుంది. తాజాగా దర్శకుడు శరత్ ‘రామారావు ఆన్ డ్యూటీ’ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు.

ప్ర. ‘రామారావు ఆన్ డ్యూటీ’ మెయిన్ థీమ్ ఎలా ఉంటుంది?

శరత్ : ‘రామారావు ఆన్ డ్యూటీ’ రవితేజ లాంటి మాస్ స్టార్ చేస్తున్న లార్జర్ దేన్ లైఫ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ఒక మిస్సింగ్ కేసుని పోలీసులు, లేదా క్రైమ్ డిపార్ట్మెంట్ డీల్ చేస్తుంది. కానీ సివిల్ ఆఫీసర్ గా రామారావు ఈ కేసును డీల్ చేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి అన్నది మెయిన్ పాయింట్.

ప్ర. ఈ సినిమా కథ ఇసుక మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఉంటుందా ?

శరత్ : ప్రత్యేకంగా ఇసుక మాఫియా అని లేదు. కలెక్టరేట్ తో ముడిపడిన విభాగాలన్నీటికీ చాలా వ్యవస్థలపై ప్రత్యేక అధికారాలు ఉంటారు. కోర్టులు పని చేయనప్పుడు కలెక్టరేట్ కు ఆదేశాలు ఇచ్చే హక్కు ఉంటుంది. కథలో ఆ సీన్ కి సంబంధించిన అంశం వచ్చినప్పుడు దాని గురించి కొంత చెప్పడం ఉంటుంది.

ప్ర. ఈ కథ ఎలా పుట్టింది?

శరత్ : కథలెప్పుడూ మనసులో తిరుగుతూనే ఉంటాయి. కొన్ని పరిణితి చెందుతుంటాయి. ఏదో ఒక హుక్ పాయింట్ దొరికినప్పుడు పూర్తిగా రాసేస్తాం. ఇది కూడా నాలుగేళ్ల క్రితం పుట్టిన ఆలోచన. రవితేజ గారు ఈ కథ లోకి వచ్చిన తర్వాత ఆయన ఇమేజ్ కి తగ్గట్టు కొన్ని మార్పులు చేశాం.

ప్ర. ట్రైలర్ లో యాక్షన్ ఎక్కువగా ఉంది. కానీ రవితేజ గారు అంటే ప్రేక్షకులు ఎంటర్ టైన్మెంట్ కూడా ఆశిస్తారు కదా?

శరత్ : నా దృష్టిలో ఎంటర్టైన్మెంట్ అంటే కామెడీ అని నేను అనుకోను. ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడమే ఎంటర్ టైన్మెంట్. ఇందులో ఫన్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది.

ప్ర. ఈ సినిమాతో మీరు కొత్తగా చెప్పాలనుకున్న అంశం ఏంటి?

శరత్ : కథ యునిక్ గా ఉంటుంది, ఇది పాత్ బ్రేకింగ్ కథ అని నేను చెప్పను కానీ చాలా వైవిధ్యంగా ఉంటుందని మాత్రం చెప్పగలను. రవితేజ గారి గత సినిమాల ఛాయలను రిపీట్ కాకుండా ఉండటానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను.

ప్ర. మీ మొదటి సినిమా ‘కే ఓ 2’ 2016 లో వచ్చింది? రెండో సినిమాకి ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది?

శరత్ : ‘కే ఓ 2’ తర్వాత కొన్ని అవకాశాలు వచ్చాయి. అయితే పెద్ద హీరోలకు ఎప్పుడూ ఒక లైనప్ ఉంటుంది. ఆ లైన్ లో ఏదైనా డ్రాప్ అయితే మన సినిమా ముందుకు వస్తుంది. మధ్యలో విశాల్ గారితో ఒక ప్రాజెక్ట్ గురించి చర్చలు జరిగాయి. తర్వాత కరోనా వచ్చింది. ‘రామారావు ఆన్ డ్యూటీ’ కథ కూడా రవితేజ గారికి చెప్పి చాలా కాలం అయ్యింది.

ప్ర. ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే టైటిల్ పెట్టాలనేది పూర్తిగా మీ థాట్ అనుకోవచ్చా?

శరత్ : రామారావు అనేది పవర్ ఫుల్ పేరు. ఆ పేరుకు పరిచయం అవసరం లేదు. పెద్దాయన లేకపోయినా ఒక సర్వే పెడితే నెంబర్ వన్ తెలుగు పర్సనాలిటీ గా ఆయన పేరు వచ్చింది. తర్వాత అదే పేరుతో వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ గారు బిగ్ హీరో. అలాగే కేటీఆర్ గారు కూడా గ్రేట్ లీడర్. ‘రామారావు’ అనేది ఒక స్ఫూర్తిని నింపే వ్యక్తిత్వం. అందుకే ఈ పాత్రకు రామారావు అని పేరు పెట్టాను.

ప్ర. ఈ చిత్రంలో సి ఐ మురళి పాత్రకి వేణు గారిని తీసుకోవాలి అని ఎందుకు అనిపించింది?

శరత్ : ఈ సినిమా సిఐ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. మీరు సినిమా చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. ఈ పాత్రకు ఎవరైతే బాగుంటుంది అని ఆలోచిస్తున్నప్పుడు వేణు గారు స్ట్రయిక్ అయ్యారు. ఆయన సినిమాలు, వీడియోలు ఇప్పటికీ చాలా పాపులర్. సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ‘స్వయంవరం’ వంటి సూపర్ హిట్లు ఇచ్చిన హీరో వేణు గారు. ఈ పాత్రకు తీసుకుంటే బాగుంటుంది అని వెళ్లి ఆయన్ని కలిశాను. లక్కీగా ఆయన ఈ పాత్ర చేయడానికి ఒప్పుకున్నారు. ఎమోషన్స్ ని అద్భుతంగా పడించే నటుడాయన. రామారావు ఆన్ డ్యూటీలో ఆయన పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

ప్ర. నిర్మాతల గురించి చెప్పండి?

శరత్ : సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్ గారు గ్రేట్ ప్రొడ్యూసర్స్. మంచి సినిమా చేయాలనే తపన వారిలో ఉంటుంది. కరోనా లాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఈ సినిమాని ఇంత గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అనేది వారి గొప్ప సంకల్పం వల్లే సాధ్యమైంది. సినిమాని ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కించారు.

ప్ర. ఈ చిత్రం కోసం రజిషా విజయన్ ని తీసుకోవాలని ఎందుకు అనిపించింది ?

శరత్ : మాలిని పాత్రకు గ్లామర్ కంటే ఎమోషనల్ కోషియంట్ ఎక్కువ.అందుకే ఒక యునిక్ నటి కావాలనిపించింది. రజిషా విజయన్ ఆ పాత్రకు సరిగ్గా నప్పుతుందని అనిపించింది. మొదట ఆమె ఒప్పుకోలేదు. కథ పూర్తిగా చెప్పిన తర్వాత ఆమెకు చాలా నచ్చింది. సినిమా పూర్తయ్యాక నా పాత్రకు సంబంధించిన సీన్లు ఏమైనా డిలీట్ చేస్తారా అని అడిగింది. అలాంటిది ఏమీ ఉండదు అని హామీ ఇచ్చాను( నవ్వుతూ)

ప్ర. ఈ సినిమాకి 5 మంది ఫైట్ మాస్టర్స్ పనిచేశారట?

శరత్ : అవును.. ఇందులో ఫైట్లు అన్నీ కథలో భాగంగా వస్తాయి. నిజానికి పెద్ద స్టంట్ మాస్టర్లు.. మల్టిపుల్ అంటే ఒప్పుకోరు. కానీ నేను రిక్వెస్ట్ చేశాను. అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ లని డిజైన్ చేశారు.

ప్ర. మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సి ఎస్ గురించి ?

శరత్ : విక్రమ్ వేద లో సామ్ సి ఎస్ వర్క్ అద్భుతంగా ఉంటుంది. ఖైదీ సినిమా చూసిన తర్వాత నేను రవితేజ గారికి ఫోన్ చేసి సామ్ సిఎస్ ని అనుకుంటున్నాని చెప్పాను. రవితేజ గారికి కూడా సామ్ అంటే అప్పటికే గురి ఉంది. సామ్ ని ఇక్కడికి పిలిచి ప్రాజెక్ట్ గురించి చెప్పాను. మేము మొదట లాక్ చేసిన టెక్నిషియన్ సామ్ సిఎస్.

ప్ర. సీసా పాట గురించి ?

శరత్ : సీమ ప్రాంతంలో ‘కులుకు భజన’ చాలా పాపులర్. ఈ కాన్సెప్ట్ ని పెట్టాలని భావించాను. దానిని ఇంకా కాస్త వినోదాత్మకంగా ఉండేలా కొన్ని ట్యూన్స్ అనుకున్నాం. చంద్రబోస్ గారిని కలిసి ఈ కాన్సెప్ట్ ని చెప్పా. ఆయన కొంత సమయం తీసుకొని సీసా పాటని రాశారు.

ప్ర. 2 గంటల 30 నిమిషాల రన్ టైమ్ వచ్చింది. ఆడియన్స్ ని ఎంగేజ్ చేయగలరని భావిస్తున్నారా ?

శరత్ : నేను ముందు కథని బలంగా నమ్ముతాను. కథ నుండి పక్కకు వెళ్ళను. నా వరకూ కథ ఒక దేవాలయం లాంటింది. దానికంటూ ఒక నిర్మాణం ఉంటుంది.ఈ విషయంలో లెజండరీ దర్శకులు దాసరి నారాయణ రావు గారి మాటలు నాకు స్ఫూర్తి. ‘ఒక కథ రాసేటప్పుడు ఆ కథే తనకు కావాల్సినవన్నీ సమకూర్చుకుని పూర్తి చేసుకుంటుంది. హిట్, ఫ్లాప్ మన చేతిలో లేదు, మంచి చెడు మాత్రం మన చేతిలో ఉంటుంది” అని ఆయన చెప్పారు. దాసరి గారు చెప్పిన ఈ మాటలు లైఫ్ టైం పాటిస్తాను. నేను టీం వర్క్ ని నమ్ముతాను. ఈ చిత్రానికి అద్భుతమైన టీమ్ వర్క్ కుదిరింది.

ప్ర. ట్విట్టర్, సోషల్ మీడియాపై ఎందుకు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు ?

శరత్ : అది నా అభిప్రాయం. సినిమా అనేది వందలాది మంది సమిష్టి కృషి. సినిమాని పూర్తిగా చూసి అర్థం చేసుకొని విశ్లేషించుకుని దాని గురించి రాయడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. రివ్యూలు ఉండాలి. రివ్యూలు చదివి చాలా నేర్చుకున్నా. చాలా మంది మంచి రివ్యూ రైటర్స్ తెలుగులో ఉన్నారు. కానీ సినిమా జరుగుతుండగానే స్క్రీన్ షాట్ తీసి ఫస్ట్ సాంగ్, ఫస్ట్ ఫైట్ అని రివ్యూలు ఇచ్చే విధానం మాత్రం కరెక్ట్ కాదు. ప్రోడక్ట్ అనేది వినియోగదారుడికి చేరకముందే ఇంత నెగిటివిటీ ఎందుకు ? అనే బాధతోనే నా అభిప్రాయం చెప్పాను.

ప్ర. ‘రామారావు ఆన్ డ్యూటీ ‘ కి సీక్వెల్ ఉంటుందా ?

శరత్ : ప్రస్తుతానికైతే సీక్వెల్ ఆలోచన లేదు. ఐతే ఇది బర్నింగ్ ఇష్యూ. దీన్ని కంటిన్యూ చేద్దామని ఆసక్తితో ఎవరైనా వస్తే .,. నా ఆలోచనలు పంచుకోవడానికి రెడీగా ఉంటాను.

ప్ర. ఏ జోనర్ లో మీకు బలం ఎక్కువ అని భావిస్తున్నారు ?

శరత్ : నా బలం ఏమిటో తెలీదు కానీ.,.నా బలహీనత తెలుసు. శేఖర్ కమ్ముల గారి లాంటి సినిమాలు నేను చేయలేను. లైటర్ వెయిన్ ఎమోషన్స్ ని డీల్ చేయడం నా వరకూ కష్టం. యాక్షన్, థ్రిల్లర్స్ చేయగలను. ఒక ఫైట్ లేకుండా కూడా యాక్షన్ సినిమా చేయొచ్చు. రాజ్ కుమార్ హిరాణీ తరహాలో ఒక కథ రాసుకున్నా.దాని గురించి త్వరలో చెప్తాను.

ప్ర. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి?

శరత్ : ఇంకా ఏమీ అనుకోలేదు. ప్రస్తుతం ‘రామారావు ఆన్ డ్యూటీ’ పైనే నా ఫుల్ ఫోకస్ ఉంది.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Divyasha Kaushik
  • #Nasser
  • #Rajisha Vijayan
  • #Rama Rao- On Duty
  • #Ravi teja

Also Read

Mugguru Monagallu: ‘ముగ్గురు మొనగాళ్లు’ ఇద్దరు డూప్..ల కహానీ..!

Mugguru Monagallu: ‘ముగ్గురు మొనగాళ్లు’ ఇద్దరు డూప్..ల కహానీ..!

The RajaSaab: ఆ 20 నిమిషాలు నెక్స్ట్ లెవెల్.. ప్రభాస్ కి ఇంకో హిట్టు పడినట్టేనా?

The RajaSaab: ఆ 20 నిమిషాలు నెక్స్ట్ లెవెల్.. ప్రభాస్ కి ఇంకో హిట్టు పడినట్టేనా?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ ఇంకా పూర్తికాలేదా?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ ఇంకా పూర్తికాలేదా?

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నటుడు మృతి

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నటుడు మృతి

Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన  నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

Balu: కరుణాకరన్ తో బలవంతంగా డైరెక్షన్ చేయించారా?

Balu: కరుణాకరన్ తో బలవంతంగా డైరెక్షన్ చేయించారా?

related news

Ravi Teja: మాస్ రాజా.. కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఇలా..

Ravi Teja: మాస్ రాజా.. కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఇలా..

trending news

Mugguru Monagallu: ‘ముగ్గురు మొనగాళ్లు’ ఇద్దరు డూప్..ల కహానీ..!

Mugguru Monagallu: ‘ముగ్గురు మొనగాళ్లు’ ఇద్దరు డూప్..ల కహానీ..!

8 hours ago
The RajaSaab: ఆ 20 నిమిషాలు నెక్స్ట్ లెవెల్.. ప్రభాస్ కి ఇంకో హిట్టు పడినట్టేనా?

The RajaSaab: ఆ 20 నిమిషాలు నెక్స్ట్ లెవెల్.. ప్రభాస్ కి ఇంకో హిట్టు పడినట్టేనా?

12 hours ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ ఇంకా పూర్తికాలేదా?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ ఇంకా పూర్తికాలేదా?

15 hours ago
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నటుడు మృతి

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నటుడు మృతి

17 hours ago
Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన  నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

1 day ago

latest news

Chandrabose: ఒక్క పాటతో రూ.10 లక్షల సంపాదన.. చంద్రబోస్ చెప్పిన ‘రాయల్టీ’ మ్యాజిక్!

Chandrabose: ఒక్క పాటతో రూ.10 లక్షల సంపాదన.. చంద్రబోస్ చెప్పిన ‘రాయల్టీ’ మ్యాజిక్!

5 hours ago
Prabhas: ప్రభాస్ రాజా సాబ్.. ఆ పాత సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తారా?

Prabhas: ప్రభాస్ రాజా సాబ్.. ఆ పాత సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తారా?

6 hours ago
Nani: చరణ్ కి లైన్ క్లియర్ చేసిన నాని.. బాక్సాఫీస్ వార్ వాయిదా!

Nani: చరణ్ కి లైన్ క్లియర్ చేసిన నాని.. బాక్సాఫీస్ వార్ వాయిదా!

6 hours ago
Anaganaga Oka Raju: సంక్రాంతిలో అందరికంటే సేఫ్ గా ల్యాండ్ అవుతున్న పోలిశెట్టి

Anaganaga Oka Raju: సంక్రాంతిలో అందరికంటే సేఫ్ గా ల్యాండ్ అవుతున్న పోలిశెట్టి

6 hours ago
Jana Nayagan: విజయ్ జన నాయగన్ రిలీజ్ ఆగుతుందా? అసలేం జరుగుతోంది?

Jana Nayagan: విజయ్ జన నాయగన్ రిలీజ్ ఆగుతుందా? అసలేం జరుగుతోంది?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version