మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’.శరత్ మండవ ఈ చిత్రానికి దర్శకుడు కాగా ‘ఎస్.ఎల్.వి సినిమాస్’ ‘ఆర్.టి.టీం వర్క్స్’ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.దివ్యాంశ కౌశిక్, రెజిషా విజయన్ లు హీరోయిన్లు. ‘ఖైదీ'(2019) ఫేమ్ సామ్ సి ఎస్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. 9 ఏళ్ళ తర్వాత సీనియర్ హీరో వేణు ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చాడు.
టీజర్, ట్రైలర్ లకు సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇన్ని అట్రాక్షన్స్ తో జూలై 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.దీంతో మొదటి వారం ఓపెనింగ్స్ చాలా దారుణంగా నమోదయ్యాయి. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం
1.36 cr
సీడెడ్
0.70 cr
ఉత్తరాంధ్ర
0.62 cr
ఈస్ట్
0.42 cr
వెస్ట్
0.21 cr
గుంటూరు
0.34 cr
కృష్ణా
0.28 cr
నెల్లూరు
0.16 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
4.09 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+ ఓవర్సీస్(తెలుగు వెర్షన్)
0.86 cr
వరల్డ్ వైడ్ టోటల్
4.95 cr
‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రానికి రూ.17.72 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.18 కోట్ల షేర్ ను రాబట్టాలి. పోటీగా పెద్ద సినిమాలు ఏమీ లేవు. కానీ ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ నిరాశపరిచాయి. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం రూ.4.95 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.
బ్రేక్ ఈవెన్ కి మరో రూ.13.05 కోట్ల షేర్ ను రాబట్టాలి.ఈ శుక్రవారం ‘బింబిసార’ ‘సీతా రామం’ వంటి క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతుండడంతో ‘రామారావు ఆన్ డ్యూటీ’ కి థియేటర్లు చాలా తగ్గిపోయాయి. కాబట్టి ఈ వీకెండ్ తో ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఫుల్ రన్ దాదాపు ముగిసినట్టే..!