మెగా పవర్ స్టార్ రాంచరణ్ సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా స్టార్ హీరో అని ఎప్పటికప్పుడు తన సేవా కార్యక్రమాలతో ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు. తాజాగా ఇప్పుడు మరో అభిమానికి అండగా నిలబడి ఆర్థిక సాయం చేయడమే కాకుండా అతనికి ఉపాధి కలిపించి గొప్ప మనసు చాటుకున్నారు. విషయంలోకి వెళితే.. ఏదైనా కొత్తగా చేస్తేనే నలుగురి మెప్పు పొందుతామన్న విజయ సూత్రాన్ని నమ్మిన వ్యక్తి జైరాజ్. చిన్నప్పటి నుండీ అతను మెగా హీరోలకు వీరాభిమాని. అలాగే చిన్నతనం నుంచి ఆర్ట్ పట్ల అభిరుచి పెంచుకున్న వ్యక్తి.
అందుకే తన అభిమాన హీరో రాంచరణ్ చిత్రాన్ని పొలాల్లో పండించి ఆకాశమంత అభిమానాన్ని చాటుకున్నాడు .రాంచరణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా ఆయన విచిత్రాలను పండించి హాట్ టాపిక్ గా నిలిచారు .గద్వాల్ జిల్లా గట్టు మండలం గోర్లఖాన్ దొడ్డి ప్రాంతంలో పొలాల్ని కౌలుకు తీసుకుని రాంచరణ్ వరి చిత్రాన్ని వేయడం ప్రారంభించారు జైరాజ్ .ఎత్తైన ప్రదేశం నుండీ చూస్తే రాంచరణ్ చిత్రం స్పష్టంగా కనిపిస్తుంది.దీని కోసం జైరాజ్ 3 నెలల శ్రమపడ్డాడు . జైరాజ్ వరినాట్లేసి బొమ్మను చిత్రీకరించారు.చరణ్ ప్రతి పుట్టినరోజుకి ఏదో ఒకటి కొత్తగా చేసి అభిమాన హీరో కి అంకితం చేయాలన్నది అతని తపన.
ఈసారి ఇలా తన అభిమానాన్ని చాటుకున్నారు. అంతేకాదు రాంచరణ్ ను కలుసుకోవడానికి ఏకంగా… తన ఊరి నుండీ హైదరాబాద్ వరకు అంటే సుమారు 264 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేసి మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నాడు.ఇక చరణ్ ను కలుసుకున్న క్షణాలు గుండెల్లో పెట్టుకుని భద్రపరుచుకున్నానంటూ ఆయన చెప్పుకొచ్చాడు. జైరాజ్ కు అమ్మ నాన్న లేరు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. రాంచరణ్ వరి చిత్రాన్ని పొలాల్లో పండించేందుకు వేల రూపాయల దాకా ఖర్చయిందని…జయరాజ్ అప్పుచేసి ఈ పనిచేస్తాను అంటే శ్రీ ర్ స్వామి నాయుడు గారు వద్దన్నారని చెప్పుకొచ్చారు.
అయితే US లో ఉన్న విజయ్ రేపల్లె గారు ఈ చిత్రాలు పండించేందుకు అయ్యే ఖర్చును పెట్టుకున్నట్టు జైరాజ్ చెప్పారు.స్వామి నాయుడు గారి ప్రోత్సాహం కూడా మరిచిపోలేనిదని జైరాజ్ చెప్పుకొచ్చారు. ఇక జైరాజ్ తో రాంచరణ్ 45 నిమిషాలు మాట్లాడి అతనికి ఆర్థిక సహాయం అందజేయడమే కాకుండా అతని ట్యాలెంట్ ను గుర్తించి సినీ పరిశ్రమలో తగిన స్థానం కల్పిస్తామని కూడా హామీ ఇచ్చాడట. దీనిపై జైరాజ్ ఆనందం వ్యక్తం చేస్తూ.. మారుమూల గ్రామంలో ఉన్న తనను, తన టాలెంట్ ను గుర్తించి ఇంత సప్పోర్ట్ చేసినందుకు రామ్ చరణ్ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్టు తెలిపాడు .