అప్పట్లో స్టార్ హీరోయిన్ గా అగ్ర హీరోలందరితోనూ నటించినప్పటికీ.. ఇప్పటికీ బిజీ యాక్ట్రెస్ గానే కొనసాగుతోంది రమ్యకృష్ణ. కేవలం తెలుగులో మాత్రమే కాదు తమిళంలో కూడా రమ్యకృష్ణ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతుంది. ముఖ్యంగా ఈమె కథా ప్రాధాన్యత ఉండే పాత్రలనే ఎంచుకుంటూ తన క్రేజ్ ను పెంచుకుంటుందని చెప్పొచ్చు. సెప్టెంబర్ 15న(ఈరోజు) రమ్యకృష్ణ తన 50వ పుట్టినరోజు వేడుకని కుటుంబసభ్యుల సమక్షంలో జరుపుకుంది. అందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రమ్యకృష్ణ భర్త మరియు ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు అయిన కృష్ణవంశీతో పాటు ఆమె పిల్లలు.. కుటుంబ సభ్యులు ఈ ఫోటోలో ఉండడాన్ని మనం గమనించవచ్చు.
తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి 260 లకు పైగా సినిమాల్లో నటించింది రమ్యకృష్ణ. ‘నరసింహా’ ‘బాహుబలి'(సిరీస్) వంటి చిత్రాలు ఈమె క్రేజ్ ను మరింతగా పెంచాయనే చెప్పాలి. ఇక ‘ఆవిడే శ్యామల’ ‘అమ్మోరు’ వంటి చిత్రాల్లో కూడా కెరీర్లో గుర్తుండి పోయే పాత్రలుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం తన భర్త కృష్ణవంశీ డైరెక్షన్లో ‘రంగమార్తాండ’ అనే చిత్రంలో నటిస్తుంది రమ్యకృష్ణ. ఇక ఈమె 50వ సంవత్సరంలోకి అడుగుపెట్టిందంటే ఆమెను అభిమానించేవాళ్ళు అస్సలు నమ్మడం లేదు. ఆమె వయసు ఇంకా 30ఏళ్ళే అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఇండస్ట్రీ నుండీ పలువురు సెలబ్రిటీలు కూడా ఈమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.