నివేత నటనను మెచ్చుకున్న రానా
- July 11, 2017 / 11:24 AM ISTByFilmy Focus
శివ నిర్వాణ దర్శకత్వంలో నాని నటించిన చిత్రం నిన్నుకోరి. ఇందులో నాని నటన కంటే అందరూ హీరోయిన్ గా నటించిన నివేత థామస్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. ఆమె అభినయం సినిమా విజయానికి దోహదం పడిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. బాలనటిగా అవార్డులు అందుకున్న ఈమె హీరోయిన్ గా మలయాళం, తమిళం సినిమాలు చేశారు. తెలుగులో జెంటిల్ మ్యాన్ సినిమా ద్వారా అడుగుపెట్టారు. నిన్ను కోరితో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ సినిమాని చూసిన దగ్గుబాటి రానా.. నివేతను అభినందించక ఉండలేకపోయారు. “కథకుడు వారిని కనుక్కోలేదు.. కథే వారిని పట్టుకుంది. అని నిన్నుకోరిలో నాని, నివేత థామస్, అది పినిశెట్టిల ఆయా పాత్రలకు సరిగా సూటయ్యారని చెప్పారు.
అంతేకాకుండా “తెలుగు చిత్ర పరిశ్రమ ఈ మధ్య కాలంలో వెతికి పట్టుకున్న గొప్ప నటి నివేతా థామస్” అంటూ కేరళ కుట్టీని ఆకాశానికి ఎత్తేశారు. ఈ బ్యూటీ ట్యాలెంట్ ని ముందుగా పసిగట్టిన ఎన్టీఆర్… జై లవ కుశలో తన జోడీగా పెట్టుకున్నారు. బాహుబలితో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రానా ప్రస్తుతం తేజ దర్శకత్వంలో నేనే మంత్రి నేనే రాజు చేస్తున్నారు. ఈ మూవీ ఆగస్ట్ 11న థియేటర్స్ లోకి రానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















