Rana Daggubati: నేను హీరో కాకపోవడానికి అదే పెద్ద సమస్య!

దగ్గుబాటి వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రానా మొదటి నుంచి ఎంతో వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ఈ విధంగా ఈయన ఎన్నో వైవిధ్యమైన చిత్రాలలో నటించారు. ఇకపోతే బాహుబలి సినిమా కూడా ఇలాంటి కోవకు చెందుతుందని చెప్పాలి. ఇలా బాహుబలి సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న రానా తాజాగా నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన విరాట పర్వం సినిమా ద్వారా ప్రేక్షకులను ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ జూన్ 17వ తేదీ విడుదల కానుంది. ఇప్పటికే చిత్ర బృందం ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొని పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. రానా ఇదివరకు సోలో హీరోగా నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈ విషయం గురించి రానా ఈ సందర్భంగా మాట్లాడారు.

ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ ఇప్పటి వరకు నన్ను కొట్టే విలన్ ఇండస్ట్రీలో లేడు అందుకే తాను హీరోగా సక్సెస్ కాలేక పోయానని సరదాగా నవ్వుతూ సమాధానం చెప్పారు. ఇక విరాట పర్వం సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను తెలిపిన రానా తన తదుపరి చిత్రం గురించి కూడా ఈ సందర్భంగా బయటపెట్టారు. తాను తన తదుపరి చిత్రాన్ని గుణశేఖర్ దర్శకత్వంలో చేస్తున్నట్లు ఈ ఇంటర్వ్యూ సందర్భంగ రానా వెల్లడించారు.

గుణశేఖర్ దర్శకత్వంలో పౌరాణిక చిత్రంగా తెరకెక్కుతున్నటువంటి హిరణ్యకశ్యప సినిమా చేయబోతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోందని, ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి నెలలో సెట్స్ పైకి వెళ్తున్నట్లు రానా తెలిపారు. ఇకపై ఈ సినిమాకి మించిన కమర్షియల్ చిత్రం లేదంటూ రానా తన తదుపరి సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. విరాటపర్వం ప్రమోషన్ లో భాగంగా రానా తన తదుపరి చిత్రం గురించి తెలియజేయడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus