అధికారిక ప్రకటన అయితే రాకుండానే.. రానా, మిహీక ల పెళ్లి ఆగష్ట్ 8న ఫిక్స్ చేసినట్టు ప్రచారం జరుగుతూ వచ్చింది. దగ్గుబాటి కుటుంబ సభ్యులు కూడా ఆ డేటే ఫిక్స్ అన్నట్టు ఇండైరెక్ట్ గా హింట్ ఇస్తూ.. పెళ్ళి పనులు మొదలు పెట్టేసారు. మరోపక్క మిహీక బజాజ్ కూడా ఆగష్టు 6,7 న ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్లకు ప్లాన్ వేసుకుంటున్నట్టు టాక్ వచ్చింది. మొత్తానికి ఆగష్ట్ 8నే రానా,మిహీక ల పెళ్లి అని ఇరు కుటుంబ సభ్యులు ఫిక్స్ చేసి.. ఈరోజు అధికారిక ప్రకటన కూడా ఇచ్చేసారు.
లాక్ డౌన్ ను చాలా వరకూ ఎత్తేసిన నేపథ్యంలో ఈ డేట్ కు ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. అయితే గతంలో కంటే మహమ్మారి ఇప్పుడు మరింతగా విజృంభిస్తుంది. ఎంత కాదనుకున్నా.. రోజుకి 100కి పైనే కేసులు నమోదవుతున్నాయి. దీంతో మళ్ళీ దేశం మొత్తం ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో రానా పెళ్లి నాటికి అంతా సెట్ అవుతుందా అనేది పెద్ద ప్రశ్న. ఈ విషయమై మిహీక బజాజ్ కుటుంబ సభ్యులతో కూడా దగ్గుబాటి కుటుంబ సభ్యులు డిస్కస్ చేశారట. చాలా కాన్ఫిడెంట్ గా ఈ డేట్ ను వారు ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది.అయితే ఇప్పటి పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది.
ఇప్పుడు ఆ మహమ్మారి మార్చి నెలలో కంటే ఎక్కువగా విజృంభిస్తుంది. రాజకీయ నాయకులు సైతం దీని భారిన పడి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతూ వస్తుంది.మొదటి లాక్ డౌన్ ను నిర్వహించినట్టు.. మరో నెల రోజుల వరకూ స్ట్రిక్ట్ గా మరో లాక్ డౌన్ ను నిర్వహించాలని.. లేక పోతే ఈ వర్షాకాలం పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని ప్రధాని మంత్రి మోడీతో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు డిస్కస్ చేస్తున్నట్టు సమాచారం. మరి.. దగ్గుబాటి రామనాయుడు గారి పెద్ద మనవడి పెళ్ళి టైంకి అంతా సెట్ అవుతుందో లేదో చూడాలి.