రానా దగ్గుబాటి నేడు అందరికీ సడన్ షాక్ ఇచ్చారు. ఆయన తనకు కాబోయే భార్యను పరిచయం చేసి ఆశ్చర్యాన్ని గురి చేశారు. ట్విట్టర్ వేదికగా రానా తనకు నచ్చిన అమ్మాయికి ప్రపోజ్ చేసినట్లు, దానికి ఆమె ఎస్ చెప్పినట్లు ఆయన చెప్పడం జరిగింది. ఇక రానా మనసు దోచిన ఆ అమ్మాయి పేరు మిహీకా బజాజ్ అని తెలుస్తుంది. ఆమె పూర్తి వివరాలు ఏమిటనేది ఇంకా తెలియాల్సివుంది. ఐతే పేరును బట్టి చూస్తే ఆమె నార్త్ ఇండియన్ అమ్మాయి అన్న విషయం అర్థం అవుతుంది.
మరి ఈ ఇద్దరికి ఎప్పుడు పరిచయం, ఎలా ప్రేమ కలిగింది అనే విషయాలు తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాలి. టాలీవుడ్ మోస్ట్ బ్యాచ్ లర్ గా ఉన్న రానా ప్రస్తుత వయసు 35 సంవత్సరాలు. గతంలో ఆయన పెళ్లి గురించి అనేక రూమర్లు వచ్చాయి. తమిళ బ్యూటీ త్రిషా ను ఆయన పెళ్లి చేసుకుంటారు అనే వార్తలు కూడా వినబడ్డాయి. ఇక లాక్ డౌన్ అనంతరం వీరు పెళ్లి చేసుకుంటారా లేక రానా ప్రస్తుత ప్రాజెక్ట్స్ పూర్తి చేసినాక ఒక్కటవుతారా అనేది తెలియాల్సివుంది.
రానా ప్రస్తుతం తెలుగులో విరాట పర్వం సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఆయన నటించిన పాన్ ఇండియా మూవీ అరణ్య విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే కొన్ని హిందీ, తమిళ చిత్రాలకు కూడా ఆయన కమిటై ఉన్నారు. వీటితో పాటు గుణశేఖర్ దర్శకత్వంలో ఆయన హిరణ్య కసిప మూవీలో నటించాల్సివుంది
View this post on Instagram
And she said Yes 🙂 ❤️#MiheekaBajaj
A post shared by Rana Daggubati (@ranadaggubati) on
Most Recommended Video
దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు