Miheeka Bajaj: నా ఫ్రెండ్ కు సపోర్ట్ చేయండి ప్లీజ్ : రానా భార్య మిహీక

మొన్ననే ఐపీయల్ ముగిసింది. దాంతో ఇప్పుడు మళ్ళీ అంతా ‘బిగ్ బాస్’ పై పడ్డారు. ప్ర‌స్తుతం బిగ్ బాస్ హ‌వానే ఎక్కువగా న‌డుస్తుంది. తెలుగులో మాత్రమే కాదు త‌మిళం, హిందీతో పాటు మిగిలిన భాషల్లో కూడా ప్రేక్షకులు బిగ్ బాస్ చూస్తూనే ఎంజాయ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.సోషల్ మీడియా ఫాలో అయ్యేవాళ్ళకి ఈ విషయం బాగా అర్ధమవుతుంది.ఎందుకంటే ‘బిగ్ బాస్’ గురించి ఎక్కువ డిస్కషన్లు, మీమ్స్ వచ్చేవి ఇక్కడే కాబట్టి..! తెలుగులో నాగార్జున,తమిళంలో కమల్‌ హాసన్‌,హిందీలో స‌ల్మాన్ ఖాన్ వంటి స్టార్లు హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా… రానా భార్య మిహీక ఓ బిగ్ బాస్ కంటెస్టెంట్ ను తెగ ప్రమోట్ చేస్తుంది. ఆ కంటెస్టెంట్ ను గెలిపించాలని కూడా ఆమె విన్నపించుకుంటుంది. అయితే ఆమె ప్రమోట్ చేసే ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ తెలుగు వ్యక్తి కాదు.ఇటీవల త‌మిళంలో ‘బిగ్ బాస్’ షో మొద‌లయ్యింది. 18 కంటెస్టెంట్లతో అక్కడ బిగ్ బాస్ ప్రారంభమైంది. వీరిలో అక్షర రెడ్డి అనే కంటెస్టెంట్ కూడా ఉంది. ఈమె ఓ మోడల్‌ అట.అలాగే మిస్‌ గ్లోబ్‌ 2019 టైటిల్ విన్నర్ కూడా!

‘విల్లా టు విలేజ్‌’ అనే రియాలిటీ షో, ‘కసు మెలా కసు’ అనే మలేషియన్‌ మూవీ ద్వారా ఈమె పాపులర్ అయ్యింది.ఈమెకు రానా భార్య మిహీక సపోర్ట్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది. ‘బిగ్ బాస్5’ తమిళ్ లో పాల్గొంటున్న నా బెస్ట్ ఫ్రెండ్ అక్షరకు కంగ్రాట్స్. ఈమెకే నా ఓటు.. మీరు కూడా ఆమెనే సపోర్ట్ చేయాలని రిక్వస్ట్ చేస్తున్నాను. ఆమె బిగ్ బాస్ విన్నర్ కావాలని ఆల్‌ ద బెస్ట్‌ చెబుతున్నాను’ అంటూ ఓ వీడియోని షేర్ చేసింది.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus