Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Reviews » Rana Naidu Season 2 Review: రానా నాయుడు: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Rana Naidu Season 2 Review: రానా నాయుడు: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

  • June 13, 2025 / 05:45 PM ISTByDheeraj Babu
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Rana Naidu Season 2 Review: రానా నాయుడు: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • రానా, వెంకటేష్ (Hero)
  • సుర్వీన్ చావ్లా, కృతి కర్బంద (Heroine)
  • అర్జున్ రాంపాల్ (Cast)
  • కరణ్ అన్షుమాన్ - సుపర్ణ్ వర్మ - అభయ్ చోప్రా (Director)
  • సుందర్ ఆరోన్ (Producer)
  • సంగీత్ - సిద్ధార్థ్ (Music)
  • జాన్ ష్మిడ్త్ (Cinematography)
  • Release Date : జూన్ 13, 2025
  • లోకోమోటివ్ గ్లోబల్ మీడియా (Banner)

2023లో నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన “రానా నాయుడు” (Rana Naidu) సృష్టించిన సెన్సేషన్ ను అంత ఈజీగా మర్చిపోలేం. సినిమా కంటెంట్ కంటే.. సినిమాలోని బూతులు, శృతి మించిన శృంగార సన్నివేశాలు ఎక్కువ హల్ చల్ చేశాయి. వెంకటేష్ (Venkatesh) వీరాభిమానులైన ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సిరీస్ విషయంలో చాలా హర్ట్ అయ్యారు. ఆ విషయాన్ని వెంకటేష్ కూడా కాస్త సీరియస్ గానే తీసుకున్నారు. అసలు ఈ సెకండ్ సీజన్ అనేది ఉండదు అనుకున్నారు చాలామంది. కట్ చేస్తే.. సీజన్ 2 అనౌన్స్ చేశారు. ఇవాళ (జూన్ 13) విడుదలైన ఈ సీజన్ 2 ఎలా ఉందో చూద్దాం..!!

Rana Naidu Season 2 Review

కథ: కథగా ఇది ప్రోపర్ సీక్వెల్. సీజన్ 1 ఎక్కడ ముగిసిందో, సరిగ్గా అక్కడినుంచే మొదలయ్యింది సీజన్ 2. ఓబీ మహాజన్ దగ్గర నుంచి బయటికి వచ్చిన రానా నాయుడు (రానా దగ్గుబాటి) భార్య, పిల్లలతో కలిసి ప్రశాంతమైన జీవితం గడపాలి అనుకుంటాడు. అంతా సెట్ అయ్యింది అనుకున్న తరుణంలో కొడుకుని కిడ్నాప్ చేశారని తెలుస్తుంది. దాంతో మళ్లీ రంగంలోకి దిగుతాడు రానా.

తన కొడుకును కాపాడుకునే క్రమంలో కొంతమందిని చంపేస్తాడు, దాంతో రౌఫ్ “అర్జున్ రాంపాల్” రంగంలోకి దిగుతాడు. డైరెక్ట్ గా రానా నాయుడ్ని ఎటాక్ చేస్తాడు.

ఈ రానా వర్సెస్ రౌఫ్ ప్రచ్ఛన్న యుద్ధంలో.. నాగ (వెంకటేష్) మధ్యలోకి వస్తాడు.

ఈ వైల్డ్ వార్ లో రానా నాయుడు ఎలా నిలబడ్డాడు? తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? అనేది “రానా నాయుడు సీజన్ 2” (Rana Naidu Season 2) స్టోరీ.

Rana Naidu Season 2 Review And Rating

నటీనటుల పనితీరు: ఎప్పట్లానే.. రానా సిరీస్ లో అందర్నీ డామినేట్ చేసేసాడు. తనదైన స్క్రీన్ ప్రెజన్స్ & పర్సనాలిటీతో సిరీస్ కి హైలైట్ గా నిలిచాడు. మొదటి సీజన్ లో బూతులు, శృంగార సన్నివేశాల మోతాదు ఎక్కువయ్యిందని ఫీడ్ బ్యాక్ ను సీరియస్ గా తీసుకున్నట్లున్నాడు రానా. సెకండ్ సీజన్ లో ఒక్కటంటే ఒక్క శృంగార సన్నివేశం కూడా లేకుండా జాగ్రత్తపడ్డాడు. కనీసం ముద్దు సీన్ కూడా లేకపోవడం గమనార్హం. అలాగే.. ఎమోషనల్ సీన్స్ లోనూ చక్కని నటనతో ఆకట్టుకున్నాడు రానా.

వెంకటేష్ (Venkatesh) కూడా ఈ సీజన్ లో బూతులు తగ్గించాడు. తన వీరాభిమానులైన ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బందిపడే స్థాయి మాటలు కానీ సన్నివేశాలు కానీ ఈ సీజన్ లో ఏమీ లేకపోవడం విశేషం. అయితే.. మిగతా కీ క్యారెక్టర్స్ తో కంపేర్ చేస్తే, వెంకటేష్ క్యారెక్టర్ అంతగా వర్కవుట్ అవ్వలేదనే చెప్పాలి. కాకపోతే.. “ఎఫ్ 1, ఎఫ్ 2” సినిమాల్లోని వెంకీ ఆసనాన్ని ఈ సిరీస్ లోనూ ట్రై చేయడం మరియు తనదైన కామెడీ టైమింగ్ తో నవ్వించే ప్రయత్నం కూడా చేశాడు.

అర్జున్ రాంపాల్ ను విలన్ గా ప్రొజెక్ట్ చేసి మంచి హైప్ ఇచ్చినప్పటికీ.. ఆ క్యారెక్టర్ ఆర్క్ సోసోగా ఉండడంతో సరిగ్గా ఎలివేట్ అవ్వలేదు. మరీ ముఖ్యంగా ఆఖరి ఎపిసోడ్ లో చంపేయాలి కాబట్టి చంపేసినట్లుగా ఉంటుంది తప్పితే సరైన జస్టిఫికేషన్ ఉండదు.

సుర్వీన్ చావ్లా గ్లామర్ యాడ్ చేసింది, అయితే.. ఎందుకని అలా బిహేవ్ చేస్తుంది, రానాని (Rana Daggubati) ఎందుకు చీట్ చేస్తుంది అనేందుకు సరైన సమాధానం లేదు. ఇక కృతి కర్బంద పాత్ర కూడా అదే తరహాలో ఉంటుంది. మిగతా నటీనటులందరూ కంటిన్యూటీతో పర్వాలేదనిపించుకున్నారు.

Rana Naidu Season 2 Review And Rating

సాంకేతికవర్గం పనితీరు: సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది కానీ.. సెట్ వర్క్ మాత్రం అసహజంగా ఉంది. చాలా సన్నివేశాల్లో బ్యాగ్రౌండ్ సెట్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. నెట్ ఫ్లిక్స్ లాంటి ప్రొడక్షన్ హౌస్ ఏమాత్రం కేర్ తీసుకోకపోవడం గమనార్హం. యాక్షన్ బ్లాక్ కూడా చాలా నీరసంగా ఉన్నాయి. డి.ఐ విషయంలో సరైన కేర్ తీసుకోకపోవడం వల్ల బ్లడ్ కూడా చాలా అసహజంగా కనిపించింది. ఈ విషయాలన్నీ సిరీస్ కి మైనస్ గా మారాయి.

ఈ సిరీస్ ను అమెరికన్ టీవీ సిరీస్ “రేయ్ డోనోవాన్” నుంచి స్ఫూర్తి పొంది తెరకెక్కించినప్పటికీ.. ఇండియన్ నేటివివిటీకి తగ్గట్లుగా మార్పులు చేశారు. అయితే… మొదటి సీజన్ కు వెంకటేష్ ఫ్యాన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ ను జాగ్రత్తగా గమనించి సెకండ్ సీజన్ లో ఎలాంటి అనవసరమైన బూతులు, అసభ్యకరమైన శృంగార సన్నివేశాలు లేకుండా జాగ్రత్తపడ్డారు. మరీ ముఖ్యంగా.. ఉన్న కొద్దిపాటి బూతులు కూడా హిందీలోనే ఉండడం అనేది కాస్త ఆడియన్స్ ను ఇబ్బందిపెట్టని విషయం. అలాగే.. సెకండ్ సీజన్ కి వచ్చేసరికి డ్రామాకి పెద్ద పీట వేయడం కూడా కొంచం ప్లస్ అయ్యింది. ఓవరాల్ గా ఫస్ట్ సీజన్ రేంజ్ ఎగ్జైట్మెంట్ క్రియేట్ లేకపోయినా, ఓ మోస్తరుగా ఆకట్టుకుంది “రానా నాయుడు” వెబ్ సిరీస్.

Rana Naidu Season 2 Review And Rating

విశ్లేషణ: బూతులు వినిపించని, బూతు బొమ్మలు కనిపించని రానా నాయుడు సీజన్ 2. అందుకు కారణం కచ్చితంగా వెంకటేష్, రానా పర్సనల్ కేర్ తీసుకోవడమే. మొదటి సీజన్ కి వచ్చిన ఫీడ్ బ్యాక్ అలాంటిది మరి. అందుకే.. ఈ సీజన్ లో విలన్ పాత్రతో ఒక సెల్ఫ్ ట్రోల్ కూడా ఉంటుంది, ఇంట్లో బూతులు మాట్లాడకూడదు అని సాగే ఆ సీక్వెన్స్ బాగా పేలింది. అయితే.. బోలెడన్ని పాత్రలు, చాలా పెద్ద కాన్వాస్, మంచి ఫ్యామిలీ డ్రామా ఉన్నప్పటికీ.. వీటన్నిటినీ బ్యాలెన్స్ చేసే స్క్రీన్ ప్లే & ఎమోషన్ మిస్ అవ్వడంతో ఈ సిరీస్ పూర్తిస్థాయిలో అలరించలేకపోయింది.

Rana Naidu Season 2 Review And Rating

ఫోకస్ పాయింట్: ఫ్యామిలీ ఆడియన్స్ ను హర్ట్ చేయని సీజన్ 2!

Rana Naidu Season 2 Review And Rating

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rana Daggubati
  • #Rana Naidu
  • #Rana Naidu Season 2
  • #Venkatesh

Reviews

Hridayapoorvam Review in Telugu: హృదయపూర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Hridayapoorvam Review in Telugu: హృదయపూర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Homebound Review in Telugu: హోమ్ బౌండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Homebound Review in Telugu: హోమ్ బౌండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

They Call Him OG Review in Telugu: దే కాల్ హిమ్ ఓజీ  సినిమా రివ్యూ & రేటింగ్!

They Call Him OG Review in Telugu: దే కాల్ హిమ్ ఓజీ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirage Review in Telugu: మిరాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirage Review in Telugu: మిరాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Chiru Vs Venky: చిరు vs వెంకీ.. 2026 సమ్మర్‌ ఫైట్‌ ఫిక్స్‌ అయిందా?

Chiru Vs Venky: చిరు vs వెంకీ.. 2026 సమ్మర్‌ ఫైట్‌ ఫిక్స్‌ అయిందా?

Rana Daggubati: ‘మిరాయ్’ లో రానా..? దానికే సర్ప్రైజా?

Rana Daggubati: ‘మిరాయ్’ లో రానా..? దానికే సర్ప్రైజా?

Rana Daggubati: ‘మాహిష్మతికి చరణ్ ఎందుకు వచ్చాడు’?!

Rana Daggubati: ‘మాహిష్మతికి చరణ్ ఎందుకు వచ్చాడు’?!

Nuvvu Naaku Nachav: 24 ఏళ్ళ ‘నువ్వు నాకు నచ్చావ్’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Nuvvu Naaku Nachav: 24 ఏళ్ళ ‘నువ్వు నాకు నచ్చావ్’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

ఒకే పాయింట్ తో వచ్చిన వెంకటేష్, ప్రభాస్ సినిమాలు.. ఫలితాలు మాత్రం సేమ్

ఒకే పాయింట్ తో వచ్చిన వెంకటేష్, ప్రభాస్ సినిమాలు.. ఫలితాలు మాత్రం సేమ్

trending news

Kantara Collections: 3 ఏళ్ళ ‘కాంతార’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Kantara Collections: 3 ఏళ్ళ ‘కాంతార’ టోటల్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
OG Collections: రెండు రెట్లు పడిపోయాయి.. పెద్ద షాక్ ఇది

OG Collections: రెండు రెట్లు పడిపోయాయి.. పెద్ద షాక్ ఇది

3 hours ago
Chatrapathi Collections: 20 ఏళ్ళ ‘ఛత్రపతి’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Chatrapathi Collections: 20 ఏళ్ళ ‘ఛత్రపతి’ టోటల్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
Vijay: కరూర్ ఘటనపై విజయ్ వీడియో మెసేజ్

Vijay: కరూర్ ఘటనపై విజయ్ వీడియో మెసేజ్

4 hours ago
Dimple Hayathi: మరో వివాదంలో చిక్కుకున్న డింపుల్ హయాతి

Dimple Hayathi: మరో వివాదంలో చిక్కుకున్న డింపుల్ హయాతి

5 hours ago

latest news

హద్దుల్లో లేకపోతే కేసులు పెడతా.. హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్!

హద్దుల్లో లేకపోతే కేసులు పెడతా.. హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్!

1 hour ago
Jr NTR, Mahesh Babu: ఎన్టీఆర్ కోసం అనుకుంటే మహేష్ వద్దకి.. మహేష్ కోసం అనుకున్నది చివరికి పవన్ వద్దకి వెళ్ళింది..!

Jr NTR, Mahesh Babu: ఎన్టీఆర్ కోసం అనుకుంటే మహేష్ వద్దకి.. మహేష్ కోసం అనుకున్నది చివరికి పవన్ వద్దకి వెళ్ళింది..!

2 hours ago
Urvashi Rautela: ఈడీ విచారణకు హాజరైన ఊర్వశి రౌటేలా

Urvashi Rautela: ఈడీ విచారణకు హాజరైన ఊర్వశి రౌటేలా

4 hours ago
Trump: మన సినిమా వసూళ్లపై ట్రంప్‌ దెబ్బ.. ఓవర్సీస్‌ వసూళ్లపై ఆశలు వదులుకోవాలా?

Trump: మన సినిమా వసూళ్లపై ట్రంప్‌ దెబ్బ.. ఓవర్సీస్‌ వసూళ్లపై ఆశలు వదులుకోవాలా?

4 hours ago
Sathyaraj: ‘కట్టప్ప’ హీరోగా సినిమా.. ఇప్పుడు అంత రిస్క్‌ ఎందుకు చేస్తున్నారు?

Sathyaraj: ‘కట్టప్ప’ హీరోగా సినిమా.. ఇప్పుడు అంత రిస్క్‌ ఎందుకు చేస్తున్నారు?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version