Virat Kohli: కోహ్లీ బయోపిక్ సినిమాకు తనే కరెక్ట్ పర్సన్!

వన్డే ప్రపంచ కప్ 2023 సెమీ ఫైనల్స్ లో విరాట్ కోహ్లీ తన విశ్వరూపం చూపించిన సంగతి మనకు తెలిసిందే. ఈ మ్యాచ్ లో భాగంగా సెంచరీ చేసినటువంటి ఈయన ఏకంగా 50 సెంచరీలతో సరికొత్త రికార్డు సృష్టించారు. ఇలా కోహ్లీ సృష్టించిన ఈ రికార్డుపై ఎంతో మంది సెలబ్రిటీలు క్రికెటర్లు స్పందిస్తూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే తాజాగా కోహ్లీ బయోపిక్ సినిమా గురించి మరోసారి తెరపై వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

నిన్న ముంబైలో జరిగిన ఈ మ్యాచ్ చూడటం కోసం పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలోనే యానిమల్ సినిమా ప్రమోషన్లలో భాగంగా రణబీర్ కపూర్ సైతం స్టేడియంలో సందడి చేశారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా మీడియాతో ముచ్చటించినటువంటి ఈయన విరాట్ కోహ్లీ బయోపిక్ సినిమా గురించి ప్రశ్నలు వేశారు. ఒకవేళ విరాట్ కోహ్లీ బయోపిక్ సినిమాలో నటించాల్సి వస్తే మీరు నటిస్తారా అంటూ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు రణబీర్ సమాధానం చెబుతూ విరాట్ కోహ్లీ బయోపిక్ సినిమా కనుక వస్తే ఆ సినిమాలో తప్పకుండా కోహ్లీనే నటించాలని ఈయన చెప్పిన సమాధానం సంచలనంగా మారింది. ఆ సినిమాలో ఆయనే బాగా సరిపోతారని ఆయన మంచి క్రికెటర్ మాత్రమే కాకుండా తనలో ఒక నటుడు కూడా ఉన్నారని ఇక కోహ్లీ కూడా చాలా ఫీట్ గా ఉన్నారు కనుక ఆయన బయోపిక్ సినిమాకు కోహ్లీనే కరెక్ట్ గా సూట్ అవుతారంటూ రణబీర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇక గతంలో కూడా చాలామంది హీరోలు తమకు (Virat Kohli) విరాట్ కోహ్లీ సినిమాలో చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తామంటూ కూడా కామెంట్ చేశారు. ఇదివరకే రామ్ చరణ్ కూడా తాను విరాట్ కోహ్లీకి అభిమాని అని తన బయోపిక్ సినిమాలో నటించే అవకాశం వస్తే చాలా సంతోషంగా చేస్తానని కూడా చెప్పుకొచ్చారు. మరి విరాట్ కోహ్లీ బయోపిక్ సినిమా చేసే అవకాశం ఎప్పుడు వస్తుందో ఆ సినిమాలో ఏ హీరో నటిస్తారో వేచి చూడాలి.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus