Ranbir Kapoor: రణబీర్ ధరించిన జాకెట్ అన్ని లక్షలా?

బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ ప్రస్తుతం వర్షం సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈయన సినిమాలన్నీ కూడా పాన్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈయన నటించిన యానిమల్ సినిమా డిసెంబర్ ఒకటవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇటీవల ప్రీ రిలీజ్ వేడుక జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఫ్రీ రిలీజ్ వేడుకలలో భాగంగా రాజమౌళి మహేష్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు (Ranbir Kapoor) రణబీర్ కపూర్ చాలా స్టైలిష్ లుక్ లో అందరి దృష్టిని ఆకర్షించారు. అతను ధరించిన జాకెట్ పై అందరి చూపు పడింది.. మస్టర్డ్-కలర్ ప్రాడా బ్లేజర్ ధరించి, అతను తన కూల్ లుక్ లో కనిపించారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ధరించినటువంటి స్వెడ్ బాంబర్ జాకెట్ గురించి ఒక వార్త వైరల్ గా మారింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ధరించిన స్వెడ్ బాంబర్ జాకెట్ అందరి దృష్టిని ఆకర్షించడంతో దీన్ని ధర ఎంత అని తెలుసుకునే ప్రయత్నం చేశారు.

అయితే దీని ఖరీదు తెలిసి ఒక్కసారిగా షాక్ అవుతున్నారు చూడగానే ఆకట్టుకునే విధంగా ఉన్నటువంటి స్వెడ్ బాంబర్ జాకెట్ ధర ఏకంగా రూ. 4.35 లక్షలు అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. ఈ విధంగా సెలబ్రిటీలు ఎంతో ఖరీదైన బ్రాండెడ్ దుస్తులను ధరించడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు ఈ క్రమంలోనే రణబీర్ సైతం ఖరీదైన జాకెట్ ధరించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ కార్యక్రమానికి మహేష్ బాబు కూడా చాలా సింపుల్ అండ్ స్టైలిష్ లుక్ లో హాజరై సందడి చేశారు ఈయన టీ షర్ట్ కూడా ఏకంగా 40 వేలకు పైగా ఖరీదు చేసిందనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus