గత ఏడాది డిసెంబర్‌లో విడుదలైన “యానిమల్”(Animal) సినిమా మునుపెన్నడూ లేని స్థాయిలో ప్రేక్షకులను మెప్పించి బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తండ్రి కొడుకుల మధ్య ఎమోషనల్ డ్రామాతో పాటు హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్‌లతో ఆకట్టుకుంది. సినిమా ఎంతగా ఆకట్టుకుందో, విడుదలైన మూడు నెలల తర్వాత కూడా ప్రేక్షకులు దీనిని మర్చిపోలేకపోతున్నారు. 900 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ అందుకోవడంతో పాటు టి-సిరీస్ సంస్థకు అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన చిత్రంగా నిలిచింది.
Ranbir Kapoor
సినిమా చివరలో చూపించిన ఓ క్లూ, “యానిమల్ 2” అనేది ఖచ్చితంగా రాబోతోందని స్పష్టం చేసింది. అయితే, హీరో రణబీర్ కపూర్ (Ranbir Kapoor) తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంకో బిగ్ అప్‌డేట్ ఇచ్చాడు. యానిమల్ 2తో ఈ ప్రాంచైజీ ఆగబోదట. మూడో పార్ట్ “యానిమల్ కింగ్‌డమ్” పేరుతో ప్లాన్ చేస్తున్నారని, ఇది పూర్తిగా కొత్త స్థాయిలో ఉంటుందని చెప్పాడు. కానీ ఈ ప్రాజెక్ట్ 2027లో మాత్రమే మొదలయ్యే అవకాశం ఉందని వెల్లడించాడు.
ఇటీవలే “స్పిరిట్” (Spirit) అనే భారీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన సందీప్ వంగా, ప్రభాస్‌తో(Prabhas) ఈ సినిమా పూర్తి చేయడానికి కనీసం రెండు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. అంతే కాకుండా, టి సిరీస్ నిర్మించబోయే అల్లు అర్జున్ మూవీ తర్వాతే “యానిమల్ 2” పనులు ప్రారంభమవుతాయని టాక్. ఇదే సమయంలో రణబీర్ కూడా రామాయణ, బ్రహ్మాస్త్ర (Brahmāstra) సీక్వెల్‌లు, ధూమ్ 4 వంటి ప్రాజెక్ట్‌లతో బిజీ కానున్నాడు.
మొత్తానికి రణబీర్ ఫ్యాన్స్ కోసం ఇది నిజంగా గుడ్ న్యూస్. “యానిమల్”లో నటనతో పాటు అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ చూపించిన రణబీర్, సీక్వెల్‌లో తన డ్యూయల్ రోల్‌తో మరింత ప్రభావం చూపించనున్నాడని సమాచారం. సందీప్ వంగా కూడా మాస్ ప్రేక్షకుల కోసం సినిమా చేస్తానని మరోసారి స్పష్టం చేశాడు. “స్పిరిట్”లో కూడా మెంటల్ మాస్ చూపిస్తానని హింట్ ఇచ్చిన ఆయన, “యానిమల్ కింగ్‌డమ్”తో ప్రేక్షకులను మరోసారి పీక్స్‌కు తీసుకెళ్లబోతున్నారని నమ్మకంగా చెప్పొచ్చు.