‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) సక్సెస్ మీట్ ఈరోజు హైదరాబాద్, ఆవాసా హోటల్లో ఘనంగా జరిగింది. ఇందులో అందరి స్పీచ్..లు హైలెట్ అయ్యాయి. దర్శకుడు సుకుమార్ (Sukumar) స్పీచ్ ఇస్తూ.. రాజమౌళికి ముందుగా థాంక్స్ చెప్పాడు.ఎందుకంటే ‘పుష్ప’ (Pushpa) సినిమాని హిందీలో రిలీజ్ చేయమని చెప్పింది ఆయనేనట. ‘నేను తీసింది పాన్ ఇండియా సినిమా కాదు’ అని సుకుమార్ చెబితే..రాజమౌళి (S. S. Rajamouli) ‘నువ్వు పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తే అది పాన్ ఇండియా సినిమా అవుతుంది.
Sukumar
లేదు అంటే రీజనల్ మూవీ అవుతుంది’ అంటూ సుకుమార్ (Sukumar) తో చెప్పాడట. అటు తర్వాత తన డైరెక్షన్ టీం అందరికీ థాంక్స్ చెప్పిన సుకుమార్.. సంధ్య థియేటర్ ఘటనపై కూడా తనదైన శైలిలో స్పందించాడు. నేను 3 రోజుల నుండి సంతోషంగా లేను. డైరెక్టర్ అనేవాడు సెన్సిటివ్ గా ఉంటాడు. నేను ఎందుకు హ్యాపీగా లేను అంటే ‘నేను 3 ఏళ్ళు కష్టపడి సినిమా తీసినా.. 6 ఏళ్ళు కష్టపడి సినిమా తీసినా నేను ఒక ప్రాణాన్ని క్రియేట్ చేయలేను.
అలాంటిది ఒక ప్రాణం మా సినిమా రిలీజ్ టైంలో పోవడం వల్ల నా మనసు ముక్కలైపోయినట్టు అయ్యింది. ఆ విషయం నుండి బయటకు రావడానికి చాలా టైం పట్టింది. దాని నుండి బయటకు వచ్చాకే ‘పుష్ప 2’ కి వచ్చిన కలెక్షన్స్ చెప్పుకోగలిగాం. ఆ కుటుంబానికి నేను (Sukumar) క్షమాపణలు చెబుతున్నాను. భవిష్యత్తులో ఆ కుటుంబానికి ఏ అవసరం వచ్చినా మేము అండగా ఉంటాం’ అంటూ చెప్పుకొచ్చాడు.