Manchu Manoj, Mohan Babu: మరోసారి వార్తల్లో మంచు కుటుంబం ఈసారి ఏమవుతుందో?
- December 8, 2024 / 12:31 PM ISTByFilmy Focus
ఓ ఏడాది క్రితం తన అన్న మంచి విష్ణు (Manchu Vishnu) తనపై దాడి చేశాడు అంటూ మంచు మనోజ్ (Manchu Manoj) చేసిన హంగామా ఇంకా గుర్తుండే ఉంటుంది. దాన్ని కవర్ చేయడం కోసం ఒక రియాలిటీ షో ప్రకటించేసి న్యూస్ ను డీవియేట్ చేసే ప్రయత్నం జరిగింది కానీ.. ఇప్పటివరకు ఆ రియాలిటీ షోకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో, అదంతా కవరింగ్ అని క్లారిటీ వచ్చేసింది. మళ్లీ ఇవాళ మంచు మనోజ్ (Manchu Manoj) తన తండ్రి మోహన్ బాబు (Mohan Babu) మీద తనను కొట్టాడు అంటూ ఏకంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
Manchu Manoj, Mohan Babu
అయితే వెంటనే మోహన్ బాబు (Mohan Babu) పీఆర్ టీమ్ స్పందించి అవన్నీ అబద్ధపు ప్రచారాలు అంటూ కవర్ చేసినప్పటికీ.. క్రైమ్ రిపోర్టర్ల సమాచారం మేరకు మోహన్ బాబు (Mohan Babu) మరియు మంచు మనోజ్ (Manchu Manoj) 100 నెంబర్ కి కాల్ చేసి పరస్పరం ఒకరి మీద ఒకరు కంప్లైంట్ ఇచ్చుకున్నారని తెలుస్తోంది, పోలీస్ స్టేషన్ నుండి ఎస్సై ఈ విషయాన్ని రిపోర్టర్లకు ధృవీకరించారు.

మరి నిజంగానే మనోజ్ (Manchu Manoj) దెబ్బలతో పోలీస్ స్టేషన్ కి వెళ్లాడా? తన తండ్రి మోహన్ బాబు (Mohan Babu) మీద కంప్లైంట్ ఇచ్చాడా? మంచు కుటుంబంలో నిజంగానే ఆస్తి తగాదాలు ఉన్నాయా? వంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే.. మంచు మనోజ్ (Manchu Manoj) లేదా మోహన్ బాబు (Mohan Babu) మీడియా ముందుకు వచ్చి క్లారిటీ అయినా ఇవ్వాలి లేదా కనీసం ఓ వీడియో బైట్ అయినా రిలీజ్ చేయాలి.












