‘రంగమార్తాండ’ నుండీ ఆసక్తికరమైన అప్డేట్..!

క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ నుండీ చాలా గ్యాప్ త‌ర్వాత రాబోతున్న చిత్రం ‘రంగ‌మార్తాండ’‌. ప్రకాష్ రాజ్,రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో ‘బిగ్ బాస్3’ విన్నర్ మరియు పాపులర్ సింగర్ అయిన రాహుల్ సిప్లిగంజ్ ను కూడా ఓ కీలక పాత్రకు ఎంపిక చేసుకున్నారు.మ‌రాఠీలో సూపర్ హిట్ అయిన ‘నటసామ్రాట్‌’ కు ఇది రీమేక్ అన్న సంగతి చాలా మందికి తెలిసిందే. ఇదిలా ఉండగా… బ‌డ్జెట్ సమస్యలు తలెత్తడంతో ‘రంగమార్తాండ’ చిత్రం షూటింగ్ ఆగిపోయిందంటూ కొద్ది రోజుల నుండీ ప్రచారం జరుగుతున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే.

20రోజుల షూటింగ్ పార్ట్ మిగిలుండగా ఈ చిత్రం షూటింగ్ ఆగిపోవడంతో దర్శకుడు కృష్ణవంశీ బాగా హర్ట్ అయినట్టు కూడా గుసగుసలు వినిపించాయి. అయితే ఆ ప్రచారంలో నిజం లేదనేది తాజా సమాచారం.మొన్ననే దర్శకుడు కృష్ణవంశీ కూడా ‘రంగమార్తాండ’.. చిత్రం కోసం తన గురువు సిరివెన్నెల సీతారామ శాస్త్రి.. అద్భుతమైన లిరిక్స్ అందించారని ఓ అప్డేట్ ఇచ్చాడు.అంతేకాదు ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ 75శాతం పూర్తయ్యిందట. మరో 15రోజుల షూటింగ్ పార్ట్ బ్యాలన్స్ ఉన్నట్టు తెలుస్తుంది.

ఇప్పటివరకూ కంప్లీట్ అయిన షూటింగ్ పార్ట్ తో చిత్ర యూనిట్ సభ్యులు మరియు దర్శకుడు కృష్ణవంశీ సంతృప్తిగా ఉన్నారట. కచ్చితంగా ఈ చిత్రంతో హిట్టు కొట్టి తిరిగి ఫామ్లోకి వస్తానని దర్శకుడు కృష్ణవంశీ ఎంతో ధీమాగా ఉన్నాడని టాక్.ఇక ఈ చిత్రానికి మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా సంగీతం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus