వైష్ణవ్ తేజ్ హీరోగా గిరీశయ్య దర్శకత్వంలో తెరకెక్కిన రంగ రంగ వైభవంగా సినిమా మరో 36 గంటల్లో థియేటర్లలో విడుదల కానుంది. వైష్ణవ్ తేజ్ నటించిన సినిమాలలో ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే కొండపొలం సినిమా ఫ్లాప్ గా నిలిచింది. కొండపొలం కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవడంతో తర్వాత సినిమాతో సక్సెస్ ను అందుకోవాలని వైష్ణవ్ తేజ్ అనుకుంటున్నారు. అయితే రంగ రంగ వైభవంగా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నా ఈ సినిమా బుకింగ్స్ మాత్రం ఆశాజనకంగా లేవు.
సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రమే ప్రేక్షకులు ఈ సినిమాపై దృష్టి పెట్టే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. రంగ రంగ వైభవంగా సినిమాకు ఏఎంబీ సినిమాస్ లో కూడా నైట్ షోలకు మాత్రమే పరవాలేదనే స్థాయిలో రెస్పాన్స్ ఉంది. బుకింగ్స్ నెమ్మదిగా పుంజుకుంటున్నాయి. గిరీశయ్య తమిళంలో సక్సెస్ సాధించినా తెలుగు ప్రేక్షకులకు ఒక విధంగా కొత్త డైరెక్టర్ అనే సంగతి తెలిసిందే. ఖుషి సినిమా ఛాయలతో ఈ సినిమా తెరకెక్కగా వైష్ణవ్ తేజ్ ఖాతాలో ఈ సినిమాతో మరో సక్సెస్ చేరుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఈ సినిమా సక్సెస్ సాధిస్తే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కేతిక శర్మకు ఈ సినిమా దర్శకుడు గిరీశయ్యకు ఆఫర్లు పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. నిర్మాతగా బీ.వీ.ఎస్.ఎన్ ప్రసాద్ కు కూడా ఈ సినిమా సక్సెస్ కీలకమని చెప్పవచ్చు. మెగా ఫ్యామిలీలో చిరంజీవి మినహా దాదాపుగా అందరు హీరోలతో సినిమాలను నిర్మించిన నిర్మాతలలో ఈయన ఒకరు కావడం గమనార్హం.
లైగర్ సినిమా నిరాశపరిచిన నేపథ్యంలో ఇండస్ట్రీ వర్గాలు సైతం ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాయి. రంగ రంగ వైభవంగా అంచనాలను అందుకుని వైష్ణవ్ తేజ్ కోరుకున్న సక్సెస్ ను అందిస్తుందేమో చూడాల్సి ఉంది.