‘హౌస్‌ఫుల్ మూవీస్’, ‘రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్ల పై కాలిపు మధు, ఎస్. వెంకట్‌రెడ్డి నిర్మాణంలో కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగమార్తాండ’. ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక, రాహుల్ సిప్లిగంజ్, బ్రహ్మానందం వంటి వారు కీలక పాత్రలు పోషించారు. మార్చ్ 22న ఉగాది కానుకగా ఈ చిత్రం విడుదల అయ్యింది. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడం జరిగింది.
మొదటిరోజు ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. ప్రమోషన్ పెద్దగా చేయకపోయినా మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించే విధంగా కలెక్ట్ చేసిన ఈ మూవీ.. వీక్ డేస్ లో చేతులెత్తేసింది.దీంతో ఫుల్ రన్లో జస్ట్ యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది ఈ చిత్రం. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం
0.90 cr
సీడెడ్
0.19 cr
ఉత్తరాంధ్ర
0.27 cr
ఈస్ట్
0.15 cr
వెస్ట్
0.09 cr
గుంటూరు
0.16 cr
కృష్ణా
0.15 cr
నెల్లూరు
0.09 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
2.00 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్
0.13 cr
వరల్డ్ వైడ్ (టోటల్ )
2.13 cr
‘రంగమార్తాండ’ (Rangamarthanda) చిత్రానికి రూ.2.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. చాలా వరకు మైత్రి వారే ఓన్ రిలీజ్ చేసుకున్నారు. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కు రూ.2.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ రూ.2.13 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.
దీంతో బయ్యర్స్ కు రూ.0.37 కోట్ల స్వల్ప నష్టాలు వాటిల్లాయి. ‘దాస్ క ధమ్కీ’ ఆ తర్వాతి వారం ‘దసరా’ వంటి సినిమాలు రిలీజ్ అవ్వడం వలన ‘రంగమార్తాండ’ కి కలిసి రాలేదు.