మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నవరస నటన ప్రదర్శించిన మూవీ రంగస్థలం. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 30 న విడుదలై ప్రపంచవ్యాప్తంగా 214 కోట్ల గ్రాస్ వసూలు చేసి అత్యధిక వసూళ్లు సాధించిన 3వ తెలుగు చిత్రంగా రికార్డులకెక్కింది. కొరటాల శివ దర్శకత్వంలో ముఖ్యమంత్రిగా మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను ఏప్రిల్ 20 న రిలీజ్ అయి వేగంగా 200 కోట్లను రాబట్టి రికార్డ్ సృష్టించింది. లాంగ్ రన్ లో కలక్షన్స్ పరంగా రెండో దాదాపు సమానంగా వసూలుచేశాయి. తమ హీరోల సినిమాలు మొదటి స్థానాల్లో నిలిచాయని అటు రామ్ చరణ్, ఇటు మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికపై చెప్పుకుంటున్నారు.
కానీ తాజా లెక్కలతో చరణ్ గెలిచినట్లు తేలిపోయింది. ఎందుకంటే అతను నటించిన రంగస్థలం15 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఇక మహేష్ భరత్ అనే నేను 6 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. దీంతో చరణ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. వందరోజులు ఆడిన కేంద్రాల విషయంలో తమ హీరోదే గెలుపని సంతోషం వ్యక్తం చేశారు. 50 రోజుల పాటు థియేటర్లలో ఉండడమే గగనమయి పోతున్న ఈ సమయంలో రెండు సినిమాలు వందరోజులమైలురాయిని చేరుకొని కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఆ విషయంలో ఇద్దరూ గెలిచారని అభినందిస్తున్నారు .