Rangde: ఓటీటీలో నితిన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

యంగ్ హీరో నితిన్ హీరోగా నటించిన చెక్, రంగ్ దే సినిమాలు నెల రోజుల గ్యాప్ లో థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26వ తేదీన రిలీజైన చెక్ సినిమా బిలో యావరేజ్ రిజల్ట్ ను అందుకుంటే మార్చి 26వ తేదీన రిలీజైన రంగ్ దే సినిమా అబవ్ యావరేజ్ గా నిలిచింది. రంగ్ దే సినిమా రిలీజ్ కు ముందు ఈ సినిమాపై అంచనాలు పెంచడానికి నితిన్, కీర్తి సురేష్ చాలా ప్రయత్నాలు చేశారు.

ఖుషీ, నువ్వే కావాలి సినిమాల స్థాయిలో రంగ్ దే సినిమా ఉంటుందని నితిన్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. అయితే కథ, కథనంలోని చిన్నచిన్న లోపాలు రంగ్ దే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాకపోవడానికి కారణమయ్యాయి. రంగ్ దే సినిమా రిలీజైన 70 రోజుల తరువాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండటం గమనార్హం. జీ5 తెలుగు అధికారక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కగా జూన్ నెల 12వ తేదీ నుంచి రంగ్ దే జీ5 యాప్ లో స్ట్రీమింగ్ కానుంది.

ఓటీటీలో రంగ్ దే సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. భీష్మ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నితిన్ కు ఆ సినిమా తరువాత వరుస ఫ్లాపులు ఎదురవుతున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలు సైతం రిలీజైన కొన్ని రోజులకే ఓటీటీలో అందుబాటులోకి వస్తుండగా రంగ్ దే మాత్రం ఆలస్యంగా ఓటీటీలో రిలీజవుతుండటం గమనార్హం. నితిన్ ప్రస్తుతం అంధాధూన్ రీమేక్ గా తెరకెక్కుతున్న మ్యాస్ట్రో సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాదే ఈ మూవీ రిలీజ్ కానుండగా ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాల్సి ఉంది.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus