ప్రముఖ నటుడు రావు గోపాల్ రావు తనయుడు రావు రమేష్ తనదైన డైలాగ్ మాడ్యులేషన్ తో ఆకట్టుకుంటున్నారు. విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తూ మెప్పుఅందుకుంటున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ‘బ్రహ్మోత్సవం’, అ.. ఆ సినిమాల్లో కొంత నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించారు. గీతాంజలి చిత్రంలో విలనిజం ప్రదర్శించారు. తొలి సారిగా పగ, ప్రతీకారాలతో రగిలి పోతున్న విలన్ పాత్రలో భయపెట్టనున్నారు. డాలీ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న కాటమరాయుడు చిత్రంలో ప్రతి కథానాయకుడిగా నటిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే కథలో పవన్ తో గొడవకు దిగనున్నారు.
దీని గురించి రావు రమేష్ మాట్లాడుతూ “అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కల్యాణ్ కు మామయ్యగా నటించాను. ‘కాటమరాయుడు’ లో విలన్ గా కనిపిస్తాను. ప్రేక్షకులకు కిక్ ఇచ్చే క్యారెక్టర్ ఇది. రాయలసీమ యాసలో నా పాత్ర ఆసక్తికరంగా సాగుతుంది. కెరీర్ లో నాకు మైలురాయి లాగా ఈ పాత్ర నిలుస్తుంది’’ అని చెప్పారు. ఎప్పుడూ గోదావరి యాసలో పంచ్ లు వేసే రావు రమేష్ ఈ సారి రాయలసీమ యాసలో అదరగొట్టనున్నారన్న మాట. పవన్ సరసన మరోమారు శృతిహాసన్ జంటగా నటిస్తున్న ఈ మూవీని శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ఉగాది సందర్భంగా కాటమరాయుడు థియేటర్లోకి రానున్నాడు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.