Rashmi Gautam: పోసిన వాళ్లను, కూసినవాళ్లను అరెస్టు చేయండి: రష్మీ.!

సినిమా ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీలో ఉన్న జంతుప్రేమికుల్లో హాట్‌ యాంకర్‌ రష్మీ గౌతమ్‌ ఒకరు. జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్తించేవారి గురించి ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటుంది. అలాగే కరోనా – లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో విశాఖపట్నం నగరంలో తిరుగుతూ ఆహారం పెట్టింది కూడా. అలాంటి రష్మీ తాజాగా ట్విటర్‌లో మరో పోస్ట్‌ పెట్టింది. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఫొటో గురించి ఆ ట్వీట్‌లో రాసుకొచ్చింది.

కుక్క పిల్లకు మద్యం పోసినట్లుగా ఓ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ ఫొటోపై స్పందించిన రష్మీ.. ఆ కుక్క పిల్లకు మద్యం పోసిన వారిని, దా పోస్ట్‌ గురించి హాస్యాస్పదంగా మాట్లాడుతున్న వారిని అరెస్ట్‌ చేయాలి అంటూ ట్వీట్‌లో పేర్కొంది రష్మీ. అయితే ఆమె ట్వీట్‌ని కూడా కొంతమంది జోక్‌ చేయడం గమనార్హం. మరి దీనిపై అధికారులు ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి. గతంలో రష్మీ చేసిన వ్యాఖ్యలకు కొంతమంది అధికారులు స్పందించి శునకాలను సెక్యూర్‌ చేసిన సందర్భాలున్నాయి.

ఇక రష్మీ చేసిన కామెంట్స్‌ సంగతి పక్కన పెడితే.. ఓ నెటిజన్‌ షేర్‌ చేసిన వీడియో కింద కామెంట్స్‌ చూస్తే.. ప్రతి వీడియోను పొలిటికల్‌ టచ్‌ ఇస్తూ కౌంటర్లు వేయడం కూడా కనిపిస్తుంది. ‘ఈ వీడియో అన్నయ్య చూస్తే అసెంబ్లీలో బిల్లు పెడతాడు. ప్రతి ఇంట్లో కుక్కను పెంచాలని, రోజూ దానికి మందు పోయాలని ఆదేశిస్తాడు. లేకపోతే రేషన్‌ కార్డు, అమ్మ ఒడి లాంటి ప్రభుత్వ పథకాలు నిలిపేస్తానని చెబుతాడు’ అంటూ కామెంట్స్‌ కనిపిస్తున్నాయి.

ఇదంతా చూస్తుంటే ప్రజల ఆలోచనలు ఎలా ఉన్నాయో అర్థమవుతోంది అని కామెంట్స్‌ కూడా ఆ వీడియో కింద కనిపిస్తున్నాయి. ప్రతి విషయాన్ని పొలిటికలైజ్‌ చేసి.. మానవత్వం ఆలోచనలే మరచిపోతున్నారు అనే కామెంట్స్‌ కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి వాళ్లను అరెస్టు చేయాలనే రష్మి ఆలోచనలకు నెటిజన్ల మద్దతు కనిపిస్తోంది.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus