రాహుల్ రవీంద్రన్ అందరికీ సుపరిచితమే. ‘అందాల రాక్షసి’ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఇతను ఆ తర్వాత సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే దర్శకుడిగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఈ క్రమంలో మొదటి ప్రయత్నంగా చేసిన ‘చి ల సౌ’ సినిమా డీసెంట్ సక్సెస్ అందుకుంది. అలాగే ఆ సినిమాకి నేషనల్ అవార్డు కూడా లభించింది. తర్వాత నాగార్జునతో ‘మన్మధుడు 2 ‘ అనే సినిమా చేశాడు. ఇది అనుకున్న ఫలితాన్ని అయితే ఇవ్వలేదు.
కానీ దర్శకుడిగా రాహుల్ ఫెయిల్ అయ్యాడు అనడం కరెక్ట్ కాదు. అతను మంచి టాలెంటెడ్ అని.. ఆ సినిమాలోని కొన్ని ఎమోషనల్ సీన్స్ ప్రూవ్ చేశాయి. అయితే 2019 లో వచ్చిన ‘మన్మధుడు 2 ‘ తర్వాత రాహుల్ రవీంద్రన్ నుండి మరో సినిమా రాలేదు. మరోపక్క అతను ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ‘సీతా రామం’ ‘శ్యామ్ సింగ రాయ్’ వంటి హిట్ సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేశాడు.
ఇక 4 ఏళ్ళ తర్వాత రాహుల్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. రష్మిక మందన్న ప్రధాన పాత్రలో ‘ది గర్ల్ ఫ్రెండ్’ అనే సినిమాని రాహుల్ తెరకెక్కించనున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో ‘గీతా ఆర్ట్స్’, ‘మాస్ మూవీ మేకర్స్’, ‘ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్’ బ్యానర్స్ పై విద్య కొప్పినేని, ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఈరోజు హైదరాబాద్ లో ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక జరిగింది. ఇది ఒక డిఫెరెంట్ లవ్ స్టోరీ అని.. కానీ సెన్సిబుల్ వేలో రాహుల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తుంది. ముందుగా సమంతతో అనుకున్న ఈ సినిమాలో రష్మిక (Rashmika) వచ్చి చేరినట్టు కూడా అంతా అనుకుంటున్నారు.