Rashmika: నేషనల్‌ క్రష్ రష్మిక మందన మేజిక్‌… ఆ లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్‌లో!

వరుస సినిమాలతో బిజీగా ఉన్న నేషనల్‌ క్రష్ రష్మిక మందన ఆసక్తికరమైన ఫీట్‌ సాధించింది. సినిమాలు, సోషల్‌ మీడియాతో బాగా మేనేజ్‌ చూస్తూ వచ్చిన రష్మిక ఐఎండీబీ ర్యాంకింగ్స్‌లో టాప్‌లోకి వచ్చింది. సినిమాలను విశ్లేషించి ర్యాంకులు ఇచ్చే ఐఎండీబీ ఈ వారం కొత్తగా చేరిన సెలబ్రిటీల జాబితాలో టాప్‌ 3లో నిలిచింది రష్మిక మందన. రష్మిక బర్త్‌డే ఇటీవల రావడం, ‘పుష్ప: ది రూల్‌’ గ్లింప్స్‌ విడుదల కావడంతో రష్మిక గురించి ఇంటర్నెట్‌లో ఎక్కువమంది మాట్లాడుకునేలా చేశాయి. దీంతో లిస్ట్‌లో ఈ మార్పులు వచ్చాయి.

ఈ లిస్టింగ్‌లో రష్మిక (Rashmika) తొలిసారి టాప్‌ 3లోకి రావడం విశేషం. కొత్త జాబితాలో తమిళ దర్శకుడు వెట్రిమారన్‌ 11వ స్థానంలో నిలిచారు. ‘విడుదలై’ సినిమాతో ఆయన టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిచిన విషయం తెలిసిందే. మరోవైపు ‘పుష్ప’రాజ్‌గా జాతీయస్థాయిలో పేరు మారుమోగిపోతున్న అల్లు అర్జున్‌ పేరు 17వ స్థానంలో ఉంది. వీరి తర్వాత ఈ లిస్ట్‌లో మృణాల్‌ ఠాకూర్‌ (31వ స్థానం), తమన్నా భాటియా (33), కరీనా కపూర్‌ (34) నిలిచారు.

‘దసరా’ సినిమాతో పాన్‌ ఇండియా రేంజిలో అదరగొట్టిన నాని 49వ స్థానంలో నిలవగా, కీర్తి సురేశ్‌ 50వ స్థానంలో నిలిచింది. వారం వారం ఈ లిస్ట్‌ మారిపోతుండేటప్పటికీ.. ఇలా టాప్‌ స్థానాల్లో నిలవడం మాత్రం సూపర్‌ అని చెప్పాలి. అంతేకాదు ఈ స్థానాల్లో మరికొన్ని రోజులు వీళ్లు ఉంటారని అంటున్నారు. ఎందుకంటే రష్మిక ఎప్పుడూ సోషల్‌ మీడియాలో సందడి చేస్తూనే ఉంటుంది. అలాగే ఆమె సినిమాలు కూడా వరుసగా ఉన్నాయి.

మరోవైపు మృణాల్‌ ఠాకూర్‌ కూడా వరుసగా వార్తల్లో నిలుస్తూనే వస్తోంది. దీంతో ఆమె కూడా తమ స్థానాన్ని కొద్ది రోజులు నిలుపుకునే అవకాశం ఉంది. అయితే ‘పుష్ప: ది రూల్‌’ లుక్‌తో అల్లు అర్జున్‌ వైరల్‌ అయ్యాడు. కాబట్టి ఈ వారం ర్యాంకింగ్స్‌ బన్నీ మళ్లీ టాప్‌లోకి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus