నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika) ‘ది గర్ల్ ఫ్రెండ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా తన కెరీర్లో ఎంత స్పెషల్ అనేది తెలియజేస్తూ.. అది చేయడానికి గల కారణాన్ని ఓ లెటర్ ద్వారా తెలిపింది రష్మిక. రష్మిక ఆ లెటర్ ద్వారా స్పందిస్తూ.. “స్త్రీగా ఎదుగుతున్న అమ్మాయిలందరికీ నా ప్రేమలేఖ. ‘నీకేం తెలుసు’ అనే ప్రశ్న ఎదుర్కొంటున్న ప్రతి అమ్మాయికీ ‘తనకేం కావాలో తనకి బాగా తెలుసు’ అనే స్థాయికి చేరుకుంటుంది.
ఆమె ప్రయాణం సాధారణమైనదేం కాదు. నువ్వు ఎన్నో దాటుకుని వచ్చావ్. కాబట్టి నిన్ను నువ్వు ప్రేమించుకోవడం మర్చిపోవద్దు. నిన్ను నువ్వు గౌరవించుకో. నిన్ను బట్టి నువ్వు గర్వపడు. ఇలాంటి అమ్మాయిలకు అండగా నిలబడిన అబ్బాయిలకు ఒకటి చెబుతున్నా. మీ ప్రేమ వల్లే తను ఇలా నిలబడింది. ప్రేమలో ఎవ్వరూ మాట్లాడని విషయాలు మా సినిమా చెబుతుంది. ప్రేమంటే హద్దులు పెట్టుకుని బంధీగా ఉండటం కాదు.. స్వేచ్ఛగా జీవించడం.

ఎలాంటి కఠినమైన పరిస్థితులు వచ్చినా తట్టుకుని ముందుకు వెళ్లగలం ధైర్యాన్ని ఇవ్వడం. నా ప్రాణం పెట్టి ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girlfriend) చేశాను. కచ్చితంగా ఇది మీ మనసుని తాకుతుందని, మీ సామర్థ్యాన్ని మీకు తెలుపుతుందని,మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటారని ఆశిస్తున్నాను. అది గనుక నిజమైతే నా ఆశయం నెరవేరినట్టే. నిశ్శబ్దాన్ని వీడి దృఢసంకల్పంతో ముందడుగు వేసే వారికి.. వారిని ప్రోత్సహించేవారికి.. నా ఈ ప్రేమ లేక అంకితం” అంటూ చెప్పుకొచ్చింది.
