Rashmika: రష్మిక ఎందుకు అరుస్తూ షూటింగ్ స్పాట్ నుండీ వెళ్ళిపోయింది.. వీడియో వైరల్!

రష్మిక మందన.. రేంజ్ ఇప్పుడు వేరు. గతంలో తాను కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో… అక్కడ అనుకోకుండా షూటింగ్ జరుగుతుంటే.. స్టూడెంట్స్ గుంపులో తాను కూడా షూటింగ్ చూడటానికి వచ్చింది రష్మిక. ఈ క్రమంలో ఆ సినిమాలో చిన్న పాత్ర కోసం ఆమెను సంప్రదించి సినిమాలోకి తీసుకున్నారు రక్షిత్ శెట్టి, రిషబ్ శెట్టి లు..! ఆ తర్వాత ఈమె ఎవ్వరూ ఊహించని విధంగా బిజీ ఆర్టిస్ట్ అయిపోయింది. ఇప్పుడైతే తెలుగు, కన్నడ భాషల్లో స్టార్ హీరోయిన్.

హిందీలో కూడా సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. వాళ్ళు (Rashmika) ఈమెకు నేషనల్ క్రష్ అనే ట్యాగ్ ను కట్టబెట్టారు. ప్రస్తుతం ‘పుష్ప 2 ‘ ‘యానిమల్’ ‘రెయిన్ బో’ వంటి చిత్రాల్లో నటిస్తూ ఈమె బిజీగా గడుపుతోంది. నితిన్ – వెంకీ కుడుముల ప్రాజెక్టులో కూడా ఈమె హీరోయిన్ గా ఎంపికైంది. మరోపక్క కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తుంది.సో రష్మిక చాలా బిజీ.. అందులో డౌటే లేదు. ఆమె బిజీ కాబట్టే.. చిరాకులు, పరాకులు ఉంటాయి.

బహుశా అందుకేనేమో.. షూటింగ్ స్పాట్లో ఈమె ఎవరిపైనో అరుస్తూ.. తర్వాత కోపంగా వెళ్ళిపోయింది. పక్కన ఉన్న వారు ఆమెను ‘మేడం మేడం అంటూ బతిమిలాడినా ఆమె వినలేదు’. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ‘రష్మికకి ఎందుకు కోపం వచ్చింది? ఏ సినిమా షూటింగ్లో ఆమెకు కోపం వచ్చింది?’ అంటూ ఈ వీడియో చూసిన నెటిజన్లు డిస్కస్ చేసుకుంటూ.. ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus