Rashmika: ‘పుష్ప: ర్యాంపేజ్‌’లో విజయ్‌ దేవరకొండ.. రష్మిక ఏమందంటే?

‘పుష్ప: ర్యాంపేజ్‌’ ఎప్పుడు స్టార్ట్‌ చేస్తారు, ఎప్పుడు వస్తుంది.. అనే వివరాలు గురించి మాట్లాడితే టూ ఎర్లీ అవుతుంది కానీ.. ఆ సినిమా గరించి వచ్చిన, వస్తున్న పుకార్లు చూస్తుంటే మాట్లాడకపోతే టూ లేట్‌ అవుతుంది. ఎందుకంటే ఆ సినిమాలో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) ఓ ప్రధాన పాత్రలో నటిస్తాడు అని పుకార్లు రావడమే. దానికి తోడు ‘ర్యాంపేజ్‌’ అనే పేరును తొలుత బయటకు చెప్పింది ఆయనే కావడం. ఈ విషయాన్ని ఆయన రూమర్డ్‌ గాళ్‌ ఫ్రెండ్‌ రష్మిక మందన  (Rashmika Mandanna)  దగ్గర ప్రస్తావిస్తే ఆసక్తికర సమాధానం ఇచ్చింది.

Rashmika

అలాగే మరో ఇంట్రెస్టింగ్‌ విషయం కూడా చెప్పింది. ‘పుష్ప 3’లో విజయ్‌ ఉన్నాడా? అంటే.. మీలాగే నాక్కూడా ఆ విషయం తెలియదు. దర్శకుడు సుకుమార్‌ (Sukumar) ప్రతి విషయంలో సస్పెన్స్ కొనసాగిస్తారు. చివరి వరకూ ఆ విషయాన్ని బయటపెట్టరు. ఇప్పుడూ అలానే చేస్తారేమో అనేలా మాట్లాడింది. అయితే ఉన్నాడా? లేదా? అనేది ఆమెకి ఈజీగా తెలుస్తుంది అని మనకు తెలుసు. ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) సినిమాకు సంబంధించిన విషయాలను కూడా సుకుమార్‌ షూటింగ్‌ సమయంలో సెట్‌లోనే చెప్పేవారని చెప్పారు.

అంటే రష్మిక (Rashmika) ఈ సినిమా ఏంటో పూర్తిగా తెలియకుండానే సినిమా ఓకే చేసింది, సినిమా సెట్స్‌కి వచ్చింది అన్నమాట. ఆ విషయం పక్కన పెడితే.. ఆమె కూడా సినిమా క్లైమాక్స్‌లో కనిపించిన వ్యక్తిని చూసి.. ‘ఇతనెవరు?’ అని నేనూ ఆశ్చర్యపోయిందట. అంతేకాదు అందరు ప్రేక్షకుల మాదిరిగానే తాను కూడా ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని చెప్పింది.

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌  (Allu Arjun) తెరకెక్కించిన సరికొత్త చిత్రం ‘పుష్ప: ది రూల్‌’. 2021లో విడుదలైన ‘పుష్ప: ది రైజ్‌’(Pushpa)కు కొనసాగింపుగా వచ్చిన చిత్రమిది. విడుదలైన ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్ల గ్రాస్‌ వసూలు చేసిన ఈ సినిమా ఇంకా రికార్డులు బద్ధలుకొడుతూనే ఉంది. సినిమా టీమ్‌ అయితే డబుల్‌ 1000 మీద దృష్టి పెట్టింది అని చెబుతున్నారు.

తన పెళ్ళి గురించి షాకింగ్ విషయాన్ని బయట పెట్టిన తాప్సి!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus