చిన్న సినిమాలతో మొదలైన తన ప్రయాణం, పాన్ ఇండియా లెవెల్లో నేషనల్ క్రష్ గా ఎదిగిన హీరోయిన్ రష్మిక మందన. ఈ భామ తన అందంతో పాటు తన మార్క్ నటనతోనూ సినీ అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. కొన్ని పాత్రలకే పరిమితం కాకుండా అన్ని జానర్స్ మూవీస్ లో నటించి తనను తాను ఒక గొప్ప నటిగా మలుచుకుంది అంతంలో ఏ మాత్రం సందేహం లేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ చిత్రం ‘పుష్ప 2’ లో హీరోయిన్ శ్రీవల్లి పాత్రలో రష్మిక నటనకి ఫిదా అవ్వని వారు లేరు. ప్రస్తుతం పుష్ప 2 చిత్రం జపాన్ లో రిలీజ్ కి సిద్ధం అవుతుండగా, ప్రమోషన్లలో పాల్గొన్నారు రష్మిక. ఆ ఇంటర్వ్యూలలో భాగంగా రష్మిక చెప్పిన సమాధానాలకు సంబందించిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Rashmika
ఆ ఇంటర్వ్యూ సందర్భంగా, రష్మిక ను ఇప్పటివరకు నటించిన హీరోలలో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎవరితో బాగుంటుంది అని ప్రశ్న అడుగగా, దానికి సమాధానంగా ” విజయ్ దేవరకొండ , అల్లు అర్జున్ మరియు ధనుష్ లతో ఆన్ స్క్రీన్ అనుభవం చాలా బాగుంటుంది అని , వారితో మళ్ళీ మళ్ళీ స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందని చెప్పకనే చెప్పింది ఈ భామ.దీంతో ఈ వీడియో వైరల్ అవ్వగా, అయితే మరోసారి ఈ హీరోలతో వర్క్ చేసే అవకాశం రష్మికకు వస్తుందా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.