కన్నడ బ్యూటీ రష్మిక మందన తొలి చిత్రం ‘ఛలో’ తోనే టాలీవుడ్ ప్రేక్షకులకి ఇష్టమైన హీరోయిన్ గా మారిపోయింది. ‘గీత గోవిందం’ తో అయితే యువతని మరింత ఆకర్షించింది. ‘సరిలేరు నీకెవ్వరు’ ‘భీష్మ’ ‘పుష్ప’ వంటి చిత్రాలతో గోల్డెన్ లెగ్ అనే ముద్ర వేయించుకుని పాన్ ఇండియా క్రేజ్ ను సంపాదించుకుని నేషనల్ క్రష్ గా మారిపోయింది.ప్రస్తుతం ఈమె బాలీవుడ్లో బిజీ అవ్వాలని తెగ ప్రయత్నిస్తుంది. బాలీవుడ్లో రెండు సినిమాల్లో నటిస్తుంది.
అవి రెండు కనుక హిట్ అయితే అక్కడ కూడా ఈమె స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నట్టే. అయితే రష్మిక మితిమీరి గ్లామర్ షో చేసిన సందర్భాలు ఇప్పుడేమో కానీ గతంలో అయితే లేవు. అయితే ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ లకి ఉండాల్సిన గ్లామర్ ఈమెలో బాగా నిండిపోయింది. ఇందుకోసం ఆమె ప్రత్యేకంగా చేసే డైట్ ఏంటి? అనే అనుమానం అందరిలోనూ ఉంది. రష్మిక అసలు ఏమి తింటుంది? ఆమె ఫేస్ లో అంత కళ ఎలా ఉంటుంది అనే విషయాలు తెలుసుకోవాలనే కూతూహలం అందరిలోనూ ఉంది.
అలాంటి వారికోసం స్వయంగా రష్మిక నే తాను ఏం ఫుడ్ తింటుంది అనే విషయాలను బయటపెట్టింది.ఓ వీడియో రూపంలో ఈ విషయాలను తెలియజేసింది. సెట్స్‌లో ఉన్నప్పుడు రష్మిక మొదట కోల్డ్ కాఫీ తాగుతుంది, తర్వాత సెలరీ జ్యూస్‌ని త్రాగుతుంది. అలాగే భోజనం టైంకి బాదం వెన్నతో కూడిన ఓట్స్, సాయంత్రం టీని త్రాగుతుంది. అలాగే చికెన్, బంగాళదుంపలను రాత్రి భోజనంగా ఈమె తీసుకుంటుంది. అది… రష్మిక లా గ్లామర్ గా ఉండాలనుకునే అమ్మాయిలు ఈ ఫుడ్ హేబిట్స్ ను అలవాటు చేసుకోవాలన్న మాట.