సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందిన తర్వాత చాలామంది ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. మంచి కోసం కంటే చెడు కోసమే ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఇందులో భాగంగా నటి రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. కొంతమంది ఈమె ఫేస్ పూర్తిగా మార్ఫింగ్ చేసి ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఈ వీడియో పై ఎంతోమంది సినీ సెలబ్రిటీలు నేటిజన్స్ అలాగే అభిమానులు కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెంటనే ఇలాంటి చర్యలకు పాల్పడినటువంటి వారిని అదుపులోకి తీసుకోవాలి అంటూ కూడా డిమాండ్స్ వ్యక్తం చేశారు. ఇక ఈ విషయంపై కేంద్ర మంత్రులు కూడా సీరియస్ అయ్యారు. ఈ క్రమంలోనే ఇలాంటి చర్యలకు పాల్పడిన నిందితుడి కోసం ఢిల్లీ పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇలా రష్మిక వీడియో క్రియేట్ చేసినది ఏపీకి చెందిన వ్యక్తి అనే విషయం తెలిసి పోలీసులు తనని అదుపులోకి తీసుకున్నారు.
ఈ క్రమంలోనే రష్మిక (Rashmika) డీప్ ఫేక్ వీడియోని క్రియేట్ చేసినటువంటి వ్యక్తి ప్రస్తుతం ఢిల్లీ పోలీసుల ఆధీనంలో ఉన్నారు. ఇక ఈ విషయం గురించి తాజాగా రష్మిక సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఢిల్లీ పోలీసులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. నన్ను ప్రేమతో, మద్దతుతో ఆదరించి, నన్ను రక్షించే సమాజానికి నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.
అమ్మాయిలు లేదా అబ్బాయిలు మీ అనుమతి లేకుండా మీ ఫోటోలను మార్పింగ్ చేయడం పూర్తిగా తప్పని ఇలా జరిగితే మీకు మద్దతు ఇచ్చే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారని, చర్యలు తీసుకోబడుతుందని గుర్తుంచుకుంటారని ఆశిస్తున్నా అంటూ నిందితుడిని అదుపులోకి తీసుకున్నందుకు ఢిల్లీ పోలీసులకు కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.