Rashmika: ఐపీఎల్ హ్యాంగోవర్ నుంచి బయటపడని రష్మిక.. పోస్ట్ వైరల్!

నటి రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉండే రష్మిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. తాజాగా 2023 ఐపీఎల్ ప్రారంభం రోజున ఈమెనటి తమన్నాతో కలిసి పలు పాటలకు డ్యాన్సులు వేసిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఐపీఎల్ ప్రారంభోత్సవంలో భాగంగా సందడి చేస్తున్న రష్మిక ఇంకా ఐపీఎల్ హ్యాంగోవర్ నుంచి బయటపడలేకపోతున్నాను అంటూ తాజాగా అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో భాగంగా ఈమె ఎంఎస్ ధోనితో కలిసి దిగిన ఫోటోలను కూడా షేర్ చేశారు. ఇలా ఎంఎస్ ధోనితో దిగిన ఫోటో చూసినటువంటి ధోని అభిమానులు అలాగే రష్మిక అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రష్మిక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె బాలీవుడ్ సినిమాలతో పాటు పుష్ప 2సినిమా షూటింగులో పెద్ద బిజీగా ఉన్నారు.

తాజాగా ఈమె (Rashmika) పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక నితిన్ సరసన కూడా రష్మిక మరొక సినిమాలో నటించబోతున్నారు. తాజాగా ఈ సినిమా పూజ కార్యక్రమాలను జరుపుకుంది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు రణబీర్ కపూర్ సరసన రష్మిక యానిమల్ అనే సినిమాలో కూడా నటిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసుకుంది.ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉండే ఈమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus