Rashmika: హీరోయిన్ రష్మిక అలాంటి కష్టాలు అనుభవించారా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన రష్మిక తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో నెగిటివ్ కామెంట్లు సాధారణం అని అయితే ఆ విమర్శలు హద్దులు దాటిన సమయంలో నోరు విప్పాల్సి ఉంటుందని రష్మిక చెప్పుకొచ్చారు. ఈ మధ్య కాలంలో తన గురించి ఏవైనా ట్రోల్స్ వస్తే ఆ ట్రోల్స్ గురించి స్పందిస్తున్నానని రష్మిక కామెంట్లు చేశారు. తాను నవ్వుతూ జీవించడాన్ని బాల్యంలోనే అలవాటు చేసుకున్నానని రష్మిక చెప్పుకొచ్చారు.

స్కూల్ లో చదువుకునే సమయంలో ఫ్యామిలీకి దూరంగా ఉండేదానినని హాస్టల్ లో మొత్తం 800 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్లని రష్మిక పేర్కొన్నారు. హాస్టల్ లో అంతమంది స్టూడెంట్స్ ఉన్నా నాతో ఎవరూ సరిగ్గా ఉండేవారు కాదని రష్మిక చెప్పుకొచ్చారు. కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా లేకపోవడం వల్ల అపార్థాలు తలెత్తాయని ఆమె తెలిపారు. నేను చేయని తప్పులకు కూడా మాటలు పడిన సందర్భాలు ఉన్నాయని ఆ సమయంలో గదిలో కూర్చొని ఏడ్చానని రష్మిక పేర్కొన్నారు.

నా సమస్యలను అమ్మతో పంచుకునేదానినని రష్మిక చెప్పుకొచ్చారు. అమ్మ వల్లే నేను ఇంత స్ట్రాంగ్ గా అయ్యానని రష్మిక కామెంట్లు చేశారు. ప్రపంచంలో ఎన్నో పెద్ద సమస్యలు ఉన్నాయని నా సమస్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని రష్మిక పేర్కొన్నారు. ఫ్రెండ్స్ అన్నాక టూర్స్ కు వెళ్లడం సహజం అని నేను విజయ్ కలిసి టూర్స్ కు వెళ్లలేదని నేను చెప్పనని రష్మిక చెప్పుకొచ్చారు. రష్మిక విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

రష్మిక నటిగా తన స్థాయిని అంతకంతకూ పెంచుకుంటున్నారు. రష్మిక పుష్ప2 సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus