Rashmika, Vijay Devarakonda: మరోసారి అడ్డంగా దొరికిపోయిన రష్మిక విజయ్ దేవరకొండ!

  • October 9, 2023 / 03:32 PM IST

టాలీవుడ్ లవ్ బర్డ్స్ గా పేరు సంపాదించుకున్నటువంటి వారిలో నటి రష్మిక మందన్న నటుడు విజయ్ దేవరకొండ జంట ఒకటి. వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా ఎలాంటి ఫోటోలు షేర్ చేసిన ఇద్దరు ఓకే బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేయడంతో తరచూ వీరి గురించి ఎన్నో రకాల వార్తలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇలా ఒకే బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేయడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని ప్రేమలో ఉండటమే కాకుండా సహజీవనం చేస్తున్నారు అంటూ కూడా వార్తలు వచ్చాయి.

ఇక వీరిద్దరూ కలిసి రెండు సినిమాలలో నటించారు దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ వార్తలు వచ్చాయి. అయితే తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని కేవలం బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ చెప్పుకోస్తూనే ఇద్దరు కలిసి వెకేషన్ లోకి వెళ్లడం ఎంజాయ్ చేయడం చేస్తున్నారు. అయితే తాజాగా వీరిద్దరి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు కనుక చూస్తే మరోసారి ఇద్దరు కలిసి వెకేషన్ వెళ్లారని స్పష్టంగా అర్థం అవుతుంది.

తాజాగా రష్మిక (Rashmika) సోషల్ మీడియా వేదికగా గతంలో తన టర్కీ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. ఇలా ఫోటో వీడియోలను షేర్ చేసినటువంటి ఈమె తాను ట్రావెలింగ్ చాలా మిస్ అవుతున్నానని క్యాప్షన్ ఇచ్చారు. ఇక రష్మిక ఎక్కడైతే ఫోటో దిగారో అదే ప్లేస్ లో విజయ్ దేవరకొండ దిగినటువంటి ఫోటోని నేటిజన్స్ బయటపెట్టారు దీంతో వీరిద్దరూ కలిసి టర్కీ వెకేషన్ వెళ్లారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇప్పటికే వీరిద్దరూ కలిసి మాల్దీవ్ వెకేషన్ కి వెళ్లి ఇద్దరూ ఒకే బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేశారు. ఇప్పుడు మరోసారి వీరిద్దరు కూడా టర్కీ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలలో సేమ్ బ్యాక్ గ్రౌండ్ ఉండడంతో ఇద్దరు కలిసి వెళ్లారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో మరోసారి వీరి రిలేషన్ గురించి కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక కెరియర్ పరంగా వీరిద్దరూ సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus